TDP: ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతలు, అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఎన్నడూ లేనంత కాన్ఫిడెంట్ గా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నారు. వారు యాక్టివిటీస్ కూడా చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి అంశం మీద టీడీపీ తనదైన శైలిలో దూసుకుపోతోంది. వచ్చే ఎన్నికలలో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్యనే ఉండబోతుంది అనే అభిప్రాయాన్ని ప్రజలలోకి బలంగా తీసుకొని వెళ్ళడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే గత మూడేళ్ళ కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరుచుగా వైసీపీ వ్యతిరేక పోరాటాలు చేస్తూ ప్రజలలోకి బలంగా వెళ్ళారు. ఒకానొక సమయంలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షం జనసేన అన్నంతగా జనంలోకి పవన్ కళ్యాణ్ ఇమేజ్ వెళ్ళింది.
అలాగే వైసీపీ నాయకులు కూడా టీడీపీని అస్సలు లెక్కచేయకుండా పవన్ కళ్యాణ్ మీదనే ఫోకస్ పెట్టేవారు. అయితే జనసేనానిని విశాఖలో నిర్భందించిన తర్వాత పవన్ కళ్యాణ్ కి పెరిగిన మైలేజ్ కి చంద్రబాబు కరెక్ట్ గా తనవైపుని తిప్పుకున్నారు. అయితే జనసేన దీనిని గ్రహించేలోపే ఆ పార్టీకి వచ్చిన సింపతీ అంతా కూడా టీడీపీకి టర్న్ అయిపొయింది. అలా రెండు, మూడు సార్లు పవన్ కళ్యాణ్ మైలేజ్ ని చంద్రబాబు వ్యూహాత్మకంగా తనవైపు తిప్పుకొని బలంగా ప్రజలలోకి తీసుకెళ్ళారు. జనసేన పార్టీ మేల్కొనేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి వచ్చిన మైలేజ్ ని అలాగే కొనసాగించి ఉంటే కచ్చితంగా బలమైన ప్రత్యర్ధి అయ్యేవారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. అయితే పొత్తు పెట్టుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ తన బలాన్ని తానె తక్కువ చేసి చూపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ నుంచి పొత్తులపై పూర్తిస్థాయిలో భరోసా దొరకడంతోనే టీడీపీ శ్రేణులకి గెలుపు ఆశలు చిగురించాయనే మాట వినిపిస్తోంది. బీజేపీని కూడా తమతో తీసుకొస్తామని పవన్ మాట ఇచ్చి ఉంటారనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబుని గెలిపించే పూర్తి బాధ్యత తీసుకున్నాడని రాజకీయ వర్గాలలో నడుస్తున్న చర్చ.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.