Tamannnah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అందాలతో , నటనతో చిత్రపరిశ్రమను ఏలుతోంది. అయితే ఒక హీరోయిన్ ఇన్ని సంవత్సరాలు రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని కొత్త అందాలు తెరముందు కనిపించినా ఈ మిల్కీ అందాలు మాత్రం చెక్కుచెదరడం లేదు. తన ఒంపులు , సొంపులతో ఇండస్ట్రీలో తమన్నా తన క్రేజ్ ను కంటిన్యూ చేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లో అందివచ్చే అవకాశాలను వినియోగించుకుంటూ సత్తా చూపెడుతోంది. ఇప్పటికే వన్నె తగ్గని అందంతో మత్తెక్కిస్తోన్న ఈ బ్యూటీ త్వరలో తన ప్రియుడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోబోతోందని ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. అయినా అమ్మడికి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో నువ్ కావాలయ్యా పాటతో ఇరగదీసింది తమన్నా..ఈ సాంగ్, డ్యాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో తమన్నా కూడా అంతే క్రేజ్ దక్కించుకుంది. అనంతరం మెగాస్టార్ చిరంజీవితో చేసిన భోళా శంకర్ ఫ్లాపైనా తమన్నాపై ఎలాంటి ప్రభావం పడలేదు. ఈ క్రమంలో తాజాగా తమన్నాకు మరో బంపర్ ఆఫర్ తగిలింది. టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
టాలీవుడ్ ఎనర్జిటిక్ సీనియర్ యాక్టర్ బాలకృష్ణ , బాబీ కాంబోలో వస్తున్న మూవీలో తమన్నాకు హీరోయన్‌గా సెలెక్ట్ చేశారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ లతో నటించింది తమన్నా. నాగార్జునకు జోడిగా కాకపోయినా ఆయన చేసిన సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించింది. ఇక ఇపుడు బాలయ్య బాబుతో మొదటిసారి స్క్రీన్ మీద రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యింది ఈ చిన్నది. భగవత్ కేసరి సినిమా హిట్ తో అసలే మంచి ఊపు మీద ఉన్న బాలయ్యా అదే క్రేజ్ తో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హీరోయిన్ ని కూడా కన్ఫామ్ చేశారు.
ఇదిలా ఉంటే బాలయ్య సినిమాలో తమన్నా హీరోయిన్ గా కాదని ఐటమ్ సాంగ్ చేయబోతోందని మరో టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎందుకంటే బాబీ తీసే ప్రతి మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన జై లవకుశ సినిమాలో తమన్నా స్వింగ్ జర ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ అప్పట్లో ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో షేక్ చేసేసింది. రీసెంట్‌గా చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యలోనూ పార్టీ సాంగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా రూపొందిస్తున్న ఎన్బీకే 109 సినిమాలో కూడా బాబీ ఒక ఐటమ్ సాంగ్ చేయబోతున్నాడని టాక్. ఇక ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను కాంటాక్ట్ చేశాడట. దీనికి తమన్నా కూడా సరేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
తమన్నా స్పెషల్ సాంగ్స్ చేయడం ఇదేమి ఫస్ట్ టైమ్ కాదు. గతంలో చాలా మూవీస్ లోనే ఐటెం సాంగ్స్‌తో రెచ్చగొట్టింది. సైజ్ జీరో, అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, కెజియఫ్, సరిలేరు నీకెవ్వరు, గని వంటి మూవీస్ లో తమన్నా స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. అయితే ఈ సాంగ్స్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటోంది తమన్నా. ఒక్కో సినిమాకి రూ.1.5 నుంచి రూ. 2 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. ఇక పెళ్లైన తర్వాత కూడా ఈ భామ కాజల్, సమంత లాగా సినిమాలు చేయాలని అనుకుంటోందట. అందుకు తన కాబోయే శ్రీవారు విజయ్ వర్మ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అందుకే తమన్నా..పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు టాక్.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.