Categories: Health

Sweating: చెమట, శరీర దుర్వాసన సమస్యతో వేధిస్తోందా… ఈ చిట్కాలు మీ కోసమే?

Sweating: వాతావరణంలో అధిక వేడి కారణంగా చెమట పట్టి శరీరం మొత్తం తడిసిపోవడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఒక్కోసారి అధిక శారీరక శ్రమ చేసిన, ఒత్తిడిగా ఉన్నప్పుడు, భయపడినప్పుడు కూడా ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటాయి. నిజానికి చెమటలు పట్టడం అనేది మన ఆరోగ్యాన్ని రక్షించడంలో జరిగే ఓ ప్రక్రియ. వాతావరణం అధిక వేడిగా ఉన్నప్పుడు మన శరీరాన్ని చల్లబడడానికి మన శరీరంలోని వ్యర్ధాలన్నీ తొలగించుకునే ప్రక్రియలో మన శరీరంపై చెమట పట్టి శరీర ఉష్ణోగ్రతలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా క్రమబద్ధీకరించడంలో సహాయపడి డిహైడ్రేషన్ సమస్య నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

చెమట పట్టడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ కొందరిలో మరీ ఎక్కువగా చెమటలు పట్టడంవల్ల మనలో చికాకు కలగడమే కాకుండా శరీరం దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటివారు నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఈ చెమట నుంచి వచ్చే దుర్వాసన సమస్యలు తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే . అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.రెండు టేబుల్‌ స్పూన్ల వెనిగర్, టేబుల్‌ స్పూన్‌ తేనెను ఓ గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని కొబ్బరినూనెను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో రాస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది.

శరీర దుర్వాసనను తగ్గించుకోవడానికి విటమిన్ సి, జింకు మూలకం అత్యధికంగా ఉన్న పండ్లు కూరగాయలతో పాటు పాలు, క్యారెట్, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, గుమ్మడి గింజలు అత్యధికంగా ఆహారంలో తీసుకోవడం వల్ల నోటి దుర్వాసనతో పాటు శరీర దుర్వాసన కూడా తగ్గుతుంది. రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా స్నానం చేయాలి. ఉతికిన బట్టలను మాత్రమే వేసుకోవాలి.చెమటలు ఎక్కువగా పట్టేవారు తడిని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్‌ ,నూలు దుస్తులు మాత్రమే ధరిస్తే మంచిది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.