Surya – Jai bheem : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అంతకముందు వరుసగా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ వరకే సరిపెట్టుకున్నాయి. విజయ్, అజిత్, కార్తి, ధనుష్ లాంటి యంగ్ హీరోలు వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న సమయంలో సూర్య మాత్రం హిట్ కోసం తపించారు. ఎట్టకేలకి లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో నటించిన సూరారై పోట్రు సినిమాతో ఊహించని సక్సెస్ అందుకున్నారు. ఇదే సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్‌తో వచ్చి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
కరోనా వేవ్స్ కారణంగా ఓటీటీ వేదికపై రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. గత కొంతకాలంగా వెండితెరపై బయోపిక్స్ బాగా ఆదరణను పొందుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన ఆకాశం నీ హద్దూరా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూడు నాలుగేళ్ళుగా భారీ హిట్ కోసం ఎదురు చూసిన సూర్య మంచి హిట్ అందుకున్నారు. కథ బావుండాలే గానీ థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ వేదిక ద్వారా రిలీజ్ చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారనే దానికి ఈ సినిమా ఓ ఉదాహరణ.
ఇక ఈ క్రమంలో సూర్య తాజా చిత్రం ‘జై భీమ్’ వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. 1995లో జరిగిన యదార్ధ ఘటన ఆధారంగా ‘జై భీమ్’ చిత్రం రూపొందగా, ఇందులో సూర్య లాయర్‌గా నటించారు. అన్యాయం జరిగిన ఓ గిరిజన మహిళకు న్యాయం జరిగేలా చేసిన ప్రధాన అంశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కథ, కథనాలలో సహజత్వం ఉండటం సినిమా సూపర్ హిట్ అయ్యేందుకు ముఖ్య కారణాలు అయ్యాయి. ఓ మంచి సినిమా ప్రేక్షకులకి చేరాలంటే థియేటర్స్‌లో మాత్రమే రిలీజ్ చేయాలి అనేదానికి బిన్నంగా ఓటీటీలో రిలీజ్ చేసి హిట్ సాధించడం ఇక్కడ గొప్ప విషయంగా చెప్పుకోవాలి. మొత్తానికి సూర్య మరో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీకి టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా, సొంత నిర్మాణ సంస్థలో సూర్య – జ్యోతిక నిర్మించారు.
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
This website uses cookies.