సాధారణంగా మనం ఏ పని చేసిన దేవుళ్ళ అనుగ్రహం మనపై ఉండాలని భావిస్తూ ఉంటాము ఇలా సకల సంపదలు కలిగి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని దేవదేవులని ప్రార్థిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఆర్థిక సమస్యలు కనుక వెంటాడుతూ ఉన్నట్లయితే ఆదివారం పూట ఈ చిన్న పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపైనే ఉంటుందని ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అమ్మవారు మనపై అనుగ్రహం కలిగిస్తారని తెలుస్తోంది.
సూర్యోదయాన్ని కంటే ముందుగా నిద్ర లేచి స్నానమాచరించి అనంతరం ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటం ఎంతో మంచిది. సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చే నీటిలో పసుపు కుంకుమతో పాటు కొన్ని నువ్వులను వేసి ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనల్ని కాచి కాపాడుతుంది. ఇక ఆదివారం రావి చెట్టుకు పూజ చేయడం కూడా ఎంతో మంచిది.
రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని మనం భావిస్తూ ఉంటాము అందుకే ఆదివారం రావి చెట్టుని పూజించడం వల్ల లక్ష్మీదేవి సంతుష్టురాలై ఇల్లు సిరి సంపదలతో నింపుతుందని విశ్వాసం. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం రావి చెట్టు క్రింద నాలుగు వైపులా దీపం వెలిగిస్తే.. ఇంటికి సంపద , శ్రేయస్సు వస్తుంది. లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా మనకు రావాల్సిన డబ్బులు కూడా వస్తాయని మన వద్ద అప్పు తీసుకున్నటువంటి వారు మనకు తిరిగి చెల్లిస్తారని పండితులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.