Sukumar : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చాలా కాలంగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వాస్తవానికి పుష్ప2ని ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అయితే రీసెంట్ గా మూవీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇది కేవలం రూమర్ అని తేలిపోయింది. పుష్ప 2 నిర్మాతలు విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని అధికారిక ప్రకటన చేసింది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదల కానుందని ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప2 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీకి పాన్ ఇండియా లెవెల్ లో ఎంతటి ఆదరణ లభించిందో అందరికీ తెలిసింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ ప్రేక్షకుల మనసు గెలుచుకుని డైరెక్టర్ గా మంచి విజయాన్ని అందుకున్నారు సుకుమార్. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు సుక్కు. ప్రేక్షకులకు ఈ సినిమాతో సరికొత్త అనుభూతిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే రిస్కీ షార్టులను కూడా తన టాలెంట్ తో సింపుల్ గా షూట్ చేసే సత్తా సుకుమార్ సొంతం. సినీ ఇండస్ట్రీలో ఎంత అనుభవం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని చోట్ల పర్ఫెక్షన్ కోసం సెకెండ్ ఆప్షన్ తీసుకోకతప్పదు. అందుకే మూవీలోని కొన్ని సీన్స్ ను షూట్ చేయడం కోసం సుకుమార్ న్యూస్ ప్రజెంటర్ దేవి నాగవల్లి సహాయం తీసుకుంటున్నారట. ఆమె దగ్గర సుక్కు మాస్టర్ పాఠాలు నేర్చుకుంటున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాలెంటెడ్ డైరెక్టరైన సుకుమార్ దేవి దగ్గర పాఠాలు నేర్చుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నాం. అసలు విషయం ఏమిటంటే పుష్ప2లో పుష్పరాజు ఓ సన్నివేశంలో మిస్ అవుతాడు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ ఇచ్చే సీన్ ఉందట. ఆ సీన్స్ ని ఎఫెక్టివ్ గా చూపించాలనే ఉద్దేశంతో సుకుమార్ న్యూస్ రీడర్ దేవి నాగవల్లిని సంప్రదించారట. ఆమె సలహాలు సూచనలు అడిగారట. సుకుమార్ రిక్వెస్ట్ మేరకు దేవి నాగవల్లి తనకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా పుష్ప2 షూటింగ్ లోకేషన్ కి వెళ్లి తన వంతు సలహాలు అందిస్తోందట.
ఆ విధంగా పుష్ప 2 మూవీలో దేవి నాగవల్లి కూడా భాగమయ్యిందని తెలుస్తుంది. అయితే దేవి నాగవల్లి స్క్రీన్ మీద కనిపించి సందడి చేస్తుందా? లేకపోతే తెర వెనుకనే ఆమె సలహాలను మాత్రమే ఇస్తుందా అన్నది తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఎదురుచూడాల్సిందే.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.