Vastu Tips: సాధారణంగా ఇంట్లో ఎంతోమంది వివిధ రకాల వస్తువులను అలంకరించుకుంటూ ఉంటారు. అలంకరించుకునే వాటిలో దేవుడి విగ్రహాలు ఫోటోలు కూడా ఉంటాయి. అయితే చాలా మంది సూర్యుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని భావిస్తుంటారు. ముఖ్యంగా రాగితో తయారు చేసిన బొమ్మను ఇంట్లో పెట్టుకోకూడదని చెబుతుంటారు. మరి నిజంగానే రాగితో తయారుచేసిన సూర్యుడు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకుండా పెట్టుకుంటే ఏం జరుగుతుంది అని విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
మన ఇంట్లో రాగి సూర్యుడి ఫోటో పెట్టుకోకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ రాగితో తయారు చేసిన సూర్యుడి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఫోటో ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుందని ఎలాంటి గొడవలు ఉండవని చెబుతున్నారు.
రాగితో చేసిన లోహ సూర్యుడిని అద్భుతమైన వాస్తు హార్మోనైజర్ గా భావిస్తారు. దీని నుంచి అనేక ప్రయోజనాలు పొందవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం రాగితో తయారుచేసిన సూర్యుడి ప్రతిమ ఇంట్లో పెట్టుకోవడం మంచిది కదా అని ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదు. మీ ఇంట్లో తూర్పు దిశలోని ఏదైనా మార్గంలో, తూర్పు గోడపై రాగి సూర్యుడిని ఉంచాలి. అలాగే ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటే తలుపు వెలుపల రాగి సూర్యుడిని ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆఫీసులో తూర్పు గోడపై రాగి సూర్యుడిని వేలాడదీయడం వల్ల వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.