Sukumar : పుష్ప2 కోసం దేవి నాగవల్లి దగ్గర సుకుమార్ పాఠాలు!

Sukumar : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చాలా కాలంగా హెడ్‏లైన్స్‎లో నిలుస్తోంది. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వాస్తవానికి పుష్ప2ని ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అయితే రీసెంట్ గా మూవీ రిలీజ్ డేట్ పోస్ట్‎పోన్ అయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇది కేవలం రూమర్ అని తేలిపోయింది. పుష్ప 2 నిర్మాతలు విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని అధికారిక ప్రకటన చేసింది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదల కానుందని ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప2 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీకి పాన్ ఇండియా లెవెల్ లో ఎంతటి ఆదరణ లభించిందో అందరికీ తెలిసింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ ప్రేక్షకుల మనసు గెలుచుకుని డైరెక్టర్ గా మంచి విజయాన్ని అందుకున్నారు సుకుమార్. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు సుక్కు. ప్రేక్షకులకు ఈ సినిమాతో సరికొత్త అనుభూతిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

sukumar-anchor-devi-nagavalli-turned-as-assistant-directer-for-pushpa-2-directer

ఇదిలా ఉంటే రిస్కీ షార్టులను కూడా తన టాలెంట్ తో సింపుల్ గా షూట్ చేసే సత్తా సుకుమార్ సొంతం. సినీ ఇండస్ట్రీలో ఎంత అనుభవం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని చోట్ల పర్ఫెక్షన్ కోసం సెకెండ్ ఆప్షన్ తీసుకోకతప్పదు. అందుకే మూవీలోని కొన్ని సీన్స్ ను షూట్ చేయడం కోసం సుకుమార్ న్యూస్ ప్రజెంటర్ దేవి నాగవల్లి సహాయం తీసుకుంటున్నారట. ఆమె దగ్గర సుక్కు మాస్టర్ పాఠాలు నేర్చుకుంటున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

sukumar-anchor-devi-nagavalli-turned-as-assistant-directer-for-pushpa-2-directer

టాలెంటెడ్ డైరెక్టరైన సుకుమార్ దేవి దగ్గర పాఠాలు నేర్చుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నాం. అసలు విషయం ఏమిటంటే పుష్ప2లో పుష్పరాజు ఓ సన్నివేశంలో మిస్ అవుతాడు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ ఇచ్చే సీన్ ఉందట. ఆ సీన్స్ ని ఎఫెక్టివ్ గా చూపించాలనే ఉద్దేశంతో సుకుమార్ న్యూస్ రీడర్ దేవి నాగవల్లిని సంప్రదించారట. ఆమె సలహాలు సూచనలు అడిగారట. సుకుమార్ రిక్వెస్ట్ మేరకు దేవి నాగవల్లి తనకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా పుష్ప2 షూటింగ్ లోకేషన్ కి వెళ్లి తన వంతు సలహాలు అందిస్తోందట.

ఆ విధంగా పుష్ప 2 మూవీలో దేవి నాగవల్లి కూడా భాగమయ్యిందని తెలుస్తుంది. అయితే దేవి నాగవల్లి స్క్రీన్ మీద కనిపించి సందడి చేస్తుందా? లేకపోతే తెర వెనుకనే ఆమె సలహాలను మాత్రమే ఇస్తుందా అన్నది తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఎదురుచూడాల్సిందే.

 

Sri Aruna Sri

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.