Stomach Pain: పొట్టనొప్పి అనేది మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సాధారణమైన సమస్యే.. కానీ కొన్నిసార్లు తీవ్రమైన సమస్య కూడా అవ్వొచ్చు.. పొట్టలో పలు కీలక అవయవాలు ఒకే ప్రాంతంలో కిక్కిరిసి ఉన్నందున, అక్కడి నొప్పికి కారణాలు గణనీయంగా ఉండవచ్చు. జీర్ణాశయం, చిన్న, పెద్ద పేగులు, పిత్తాశయం, క్లోమం, ఇతర అంతర్గత అవయవాల సమస్యలు ఈ నొప్పికి కారణమవుతాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం, నొప్పి తలెత్తిన ప్రదేశం ఆధారంగా, దానికి కారణమైన వ్యాధిని అంచనా వేయడం సాధ్యమవుతుంది.
నొప్పి ప్రదేశం ఆధారంగా కారణాల గుర్తింపు
నొప్పి ఎగువ పొట్ట, కింది పొట్ట, కుడి, ఎడమ డొక్కల్లో, పొత్తికడుపులో మొదలవచ్చు. ఏ ప్రదేశంలో నొప్పి వస్తుందో బట్టి, అది ఏ విధంగా వ్యాపిస్తున్నదో బట్టి నిపుణులు కారణాలను గుర్తించగలుగుతారు. కొన్నిసార్లు నొప్పి వెన్ను వైపు పాకుతుంది, మరికొన్ని సందర్భాల్లో మాత్రం మెల్లగా వస్తూ మెల్లగా తీవ్రమవుతుంది. నొప్పి తలెత్తే విధానం.. పిండినట్టా, పొడిచినట్టా.. తదితర లక్షణాలతో కూడి ఉండవచ్చు. ఇలా నొప్పితో పాటు ఇతర అనుబంధ లక్షణాలపై గమనించి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.
వివిధ రకాల పొట్టనొప్పి, వాటి సూచనలు
ఎగువ పొట్టలో మంట, నొప్పి: ఎక్కువగా ఆమ్లం ఉత్పత్తి కావడం వల్ల తినగానే పైపొట్టలో మంట, నొప్పి తలెత్తవచ్చు. ఇది సాధారణంగా కుడివైపు ఎక్కువగా ఉంటుంది.
కుడి/ఎడమ డొక్కల్లో తీవ్రమైన నొప్పి: కుడి లేదా ఎడమ డొక్కల్లో ఒకేసారి తీవ్రమైన నొప్పి రావడం, వాంతులు, జ్వరం మొదలవడం ఇవన్నీ తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు సూచన కావచ్చు (ఉదాహరణకు, అపెండిసైటిస్, కిడ్నీలో రాళ్లు).
పొట్ట/పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం: పొట్ట లేదా పొత్తికడుపు దగ్గర నొప్పి, ఉబ్బరంతో ఉంటే అది హెర్నియా కావచ్చు. ఇది సాధారణంగా బొడ్డు దగ్గర లేదా పురుషుల్లో గజ్జల్లో కనిపించవచ్చు. పలు సర్జరీల తర్వాత కూడా పేగులు అతుక్కుపోవడం వల్ల ఇదే తరహా నొప్పి తలెత్తవచ్చు.
గుండెపోటుకు సూచనగా పొట్టనొప్పి: కొన్నిసార్లు పొట్టనొప్పి గుండెపోటుకు సూచన కావచ్చు. ముఖ్యంగా పైపొట్టలో నొప్పితో పాటు చెమటలు, ఆయాసం ఉండినపుడు, అది గుండె సంబంధిత సమస్యగా భావించి తక్షణమే వైద్యులను సంప్రదించాలి. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.
కదలికలతో నొప్పి: కొంతమందిలో కదలికల సమయంలో మాత్రమే నొప్పి రావచ్చు, అది వెన్నుపూస, కండరాల సంబంధిత సమస్య కావచ్చు. బరువు ఎత్తే సమయంలో నొప్పి వస్తే అది కండరం చీలిక సూచన కావచ్చు, దీన్ని నిర్లక్ష్యం చేస్తే హెర్నియాకి దారి తీస్తుంది.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
పొట్టనొప్పికి మందులు వేసుకుని విశ్రాంతి తీసుకోవడం చాలామందిలో కనిపించే సాధారణ అలవాటు. కానీ ఇది అత్యంత ప్రమాదకరం. నొప్పి కింది లక్షణాలతో కూడి ఉంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి:
ఒక గంటకిపైగా కొనసాగితే.
ఒకే ప్రదేశానికి పరిమితమైతే.
తాకినప్పుడు నొప్పి పెరిగితే.
వాంతులు, జ్వరం, విరోచనం వంటి అదనపు లక్షణాలు ఉంటే.
స్కానింగ్ వంటి పరీక్షల ద్వారా అసలు సమస్యను గుర్తించడం అవసరం.
పొట్టనొప్పిని చిన్న విషయం అనుకొని నిర్లక్ష్యం చేయకూడదు. ఆరంభంలో తేలికగా కనిపించినా, దీని వెనుక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు దాగి ఉండొచ్చు. త్వరితగతిన నిపుణుల సలహా తీసుకోవడమే ఉత్తమ పరిష్కారం. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.