Peddi: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్ చరణ్, ఆ తర్వాత చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో అభిమానులను కొంతవరకు నిరాశపరిచాడనే చెప్పాలి. అయితే ఈ గ్యాప్‌ను ‘పెద్ది’ సినిమాతో పూరించేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రూరల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతుండగా, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. తాజాగా చరణ్ ఈ సినిమాలో తన పాత్ర కోసం గట్టిగా శారీరకంగా మారిపోయినట్టు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ జిమ్ ఫోటోతో నిరూపించాడు.
చరణ్ పంచుకున్న ఆ ఫోటోలో ఆయన హ్యాండ్స్, బైసెప్స్ వంటి భాగాలను బాగా డెవలప్ చేస్తున్నట్లు కనిపించింది. దీంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. అభిమానులు “ఈసారి గట్టిగా కొట్టే టైమ్ వచ్చేసింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో చరణ్ ఒక క్రికెటర్, కబడ్డీ ఆటగాడిగా కనిపించబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన ట్రాన్స్‌ఫార్మేషన్ చూస్తుంటే యాక్షన్ సన్నివేశాల కోసం సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. బాడీ లాంగ్వేజ్, మాస్ లుక్‌తో విలన్లను గాల్లోకి విసిరేలా ఓ మాస్ అవతారంలో కనిపించబోతున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది ఏఆర్ రెహమాన్. ఈ కాంబినేషన్‌కి ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఈ సినిమా యొక్క తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. చిత్రబృందం ఇప్పటికే సినిమా విడుదల తేదీగా 2026 మార్చి 27ని ప్రకటించింది. ఈ మేరకు ప్రమోషన్లు ప్రారంభం కాగా, రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్‌తో సినిమా హైప్ మరింత పెరగనుంది. మొత్తంగా, ‘పెద్ది’ మూవీ రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలు రాయిగా నిలవబోతున్నట్టు కనిపిస్తోంది. బుచ్చిబాబు స్టైల్ మాస్ కథనంతో ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపేలా ఈ సినిమా రూపొందుతున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.