SSMB 28 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూడవ చిత్రం. గతంలో అతడు, ఖలేజా లాంటి చిత్రాలొచ్చాయి. అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా స్మాల్ స్క్రీన్ మీద మాత్రం మంచి టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేశాయి.
ఆ క్రేజ్‌తోనే మహేష్ మళ్ళీ గురూజీకి ఛాన్స్ ఇచ్చారు. అదీకాక త్రివిక్రమ్ సినిమా అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. మహేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. అందుకే త్రివిక్రమ్ సినిమాను ఓకే చేశారు. సర్కారు వారి పాట ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే, ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంచించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు నెట్టింట మహేష్ అభిమానులకి ఉత్సాహాన్నిస్తూ చక్కర్లు కొడుతోంది.
ఈ ఉగాది పండుగనాడు మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ మహేష్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయని సమాచారం. మహేష్ సినిమా అంటే దర్శకులు ఆయనని ఎంత కొత్తగా చూపించాలని తాపత్రయపడుతుంటారు. ఎప్పటికప్పుడు ఆయన లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.
అందుకే, ఈ SSMB 28 మూవీ నుంచి మహేష్ ఫస్ట్ లుక్ అనగానే అందరిలో ఓ ఆతృత మొదలైంది. చూడాలి మరి ఈ లుక్ రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. హారికా అండ్ హాసింక్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఆగస్టు 11వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.