Sreeleela: కమిట్‌మెంట్ విషయంలో ముందే చెప్పాలి..కండీషన్స్ అప్లై..! అంటుంది కుర్రభామ శ్రీలీల. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా కాసేపు తన ఇన్స్టాగ్రాంలో చాట్ చేసింది శ్రీలీల. ఈ సమయంలో ఓ తుంటరి నెటిజన్ అడిగిన ప్రశ్నకి అస్సలు కంగారు పడకుండా షాకిచ్చేలా వాడికి సమాధానమిచ్చింది.
శ్రీలీలని నెటిజన్ “ఆర్ యూ కమిటెడ్” అని అడిగాడు. దానికి సమాధానంగా “ఎస్ వర్క్ విషయంలో నేను చాలా కమిటెడ్‌గా ఉంటాను” అని చెప్పింది. ఇందులో కమిటెడ్ అనే మాట గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి ఈ పదం వాడతారు. అది దృష్టిలో పెట్టుకునే నెటిజన్ శ్రీలీలను ఆ విధంగా అడిగాడు. అయితే, ఇప్పుడు ఇంకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
శ్రీలీల సినిమాకి కమిటయ్యే ముందు నిర్మాతలకి కొన్ని కండీషన్స్ పెడుతుందట. ‘పెళ్లి సందD’, ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలలో క్రేజీ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అందరు తన చుట్టే తిరుగుతున్నారు. త్వరలో ‘ఆదికేశవ’, ‘ఎక్స్ట్రార్డినరీ మేన్’ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మహేశ్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని కమిటయింది.
అయితే, కొత్త ప్రాజెక్ట్ కమిటయ్యే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. ఖచ్చితంగా ఇచ్చిన డేట్స్‌లో తన పార్ట్ షూట్ కంప్లీట్ అవ్వాలని నిర్మాతలకి కండీషన్ పెడుతుందట శ్రీలీల. ఎందుకంటే ఒక్క సినిమా డేట్స్ గనక మిస్ అయితే ఆ ప్రభావం మిగతా వాటిపై పడుతుంది కాబట్టి. ఎక్స్ట్రా డేట్స్ సర్దుబాటు చేయలేలనీ నిర్మొహమాటంగా చెప్పేస్తుందట. తనవల్ల మిగతావాళ్ళు అసలు ఇబ్బంది పడకూడదని శ్రీలీల అభిప్రాయం. అందుకే, డేట్స్ విషయంలో పక్కాగా ఉంటుందట. అదీ అసలు విషయం. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కోటిన్నర వరకూ డిమాండ్ చేస్తుందని సమాచారం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.