Akkineni Venkat : ఆ కారణంతోనే అన్నపూర్ణ స్టూడియోస్ కి దూరంగా ఉంటున్న

Akkineni Venkat : అక్కినేని ఫ్యామిలీ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ లో ఆయనకు ఉన్న ఫేమ్ అలాంటిది మరి. ఆయన వరసత్వాన్ని ఇప్పటికీ అక్కినేని ఫ్యామిలీ కొనసాగిస్తోంది. అక్కినేని నాగేశ్వరావుకు ఇద్దరు కొడుకులు. అక్కినేని వెంకట్ పెద్ద కొడుకు కాగా.. అక్కినేని నాగార్జున రెండో కొడుకు. వీరిద్దరూ ఇండస్ట్రీలోనే ఎదిగారు. నాగ్ హీరోగా సెటిల్ అయ్యారు, అన్న వెంకట్ ప్రొడ్యూసర్. అయితే నాగార్జున తెలిసినంతగా చాలామందికి వేంకట తెలియకపోవచ్చు.ఇక నాగేశ్వరరావు గారు చనిపోయాకా.. అక్కినేని కుటుంబంలో విబేధాలు అంటూ రూమర్స్ వచ్చాయి. ఆస్తి పంపకాల్లో, అన్నపూర్ణ స్టూడియోస్ విషయంలో అన్నదమ్ముల గొడవలు వచ్చాయని రకరకాల వార్తలు వచ్చాయి. ఈ విషయాలపై నాగ్ ఏరోజు రియాక్ట్ లేదు.అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో మాత్రం వెంకట్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.

akkineni-venkat-gives-clarity-about-property-issues-with-akkineni-nagarjuna

అక్కినేని వెంకట్ టాలీవుడ్ లో పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అన్నపూర్ణ బ్యానర్‌పైనే ఆ చిత్రాలన్నీ నిర్మించారు. అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు తర్వాత ఆయన వారసత్వాన్ని నాగార్జున సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. కానీ వెంకట్ అమెరికాలో చదువుకుని భారత్ తిరిగొచ్చారు. అయినా ఆయన మీడియాకు కొంచెం దూరంగానే ఉంటుంటారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..

akkineni-venkat-gives-clarity-about-property-issues-with-akkineni-nagarjuna

” నేను, నాగార్జున ఇండస్ట్రీ వాతావరణంలో పెరగలేదు. మా ఇద్దరికీ సినిమాల గురించి అంతగా అవగాహన లేదు. మేము బాగా చదువుకోవాలని నాన్నగారు మమ్మల్ని ఇండస్ట్రీకి దూరంగానే పెంచారు. నాన్నగారు ఎప్పుడూ సినిమాలకి సంబంధించిన కార్యక్రమాలను మాపై రుద్దే ప్రయత్నం చేయలేదు. మా ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత నాగార్జున సినిమా ఎంట్రీ గురించి నేనే నాన్నగారితో మాట్లాడాను. ఆయన వెంటనే ఓకే అన్నారు.

akkineni-venkat-gives-clarity-about-property-issues-with-akkineni-nagarjuna

నేను ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నానని భయపడుతూనే నాన్నగారిని అడిగాము. దానికి ఆయన సరేనన్నారు. ఆ తరువాత చాలాకాలం అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలన్నీ నేను చూసేవాడిని. ఆ తరువాత జనరేషన్ గ్యాప్ వస్తుందని నేనే పక్కకి తప్పుకున్నాను . సినిమా వ్యవహారాలు నాకు అంతగా తెలియవు.. ఆ విషయాలపై నాగ్ కు మంచి పట్టు ఉంది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేమిద్దరం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాము. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు అన్నీ నాగార్జుననే దగ్గరుండి చూసుకుంటున్నాడు” అని వెంకట్ తెలిపారు.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.