SreeLeela: టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకునే దిశగా అందాల భామ శ్రీలీల దూసుకుపోతుంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడుకి మొదటి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. అయినా కూడా ఊహించని స్థాయిలో వరుస అవకాశాలని ఈ అమ్మడు అందుకుంది. ఇక రెండో సినిమాని రవితేజతో ధమాకా చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో శ్రీలీల సెన్సేషన్ గా మారింది.
ఇక ధమాకా మూవీ రిలీజ్ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో అమ్మడు నటించింది. ఇక ఈ మూవీ సెట్స్ పైన ఉండగానే ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించే ఛాన్స్ ని కొట్టేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఖరారు అయ్యింది.
నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కూడా ఆమెని హీరోయిన్ గా ఖరారు చేశారు. వీటితో పాటు రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోని, నితిన్, వక్కంతం వంశీ మూవీలో కూడా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఓవరాల్ గా తెలుగులోనే ఆమె చేతిలో ఏకంగా 10 సినిమాల వరకు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలలో చాలా వరకు పాన్ ఇండియా రేంజ్ మూవీస్ కావడం విశేషం. ఈ సినిమాలు హిట్ అయితే మాత్రం శ్రీలీల రేంజ్ కచ్చితంగా మారిపోతుంది అని చెప్పాలి. మొత్తానికి టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఒక్క సినిమా రిలీజ్ తోనే ఏకంగా పది సినిమాలకి కమిట్ అయిన హీరోయిన్ గా శ్రీలీల అరుదైన గుర్తింపుని సొంతం చేసుకుంది అని చెప్పాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.