YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసిపి మరల 2024 ఎన్నికలలో గెలవడానికి వ్యూహాలు వేసుకుంటూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తోంది. ఇప్పటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను అధికార పార్టీ నిర్వహిస్తోంది. గ్రామ సారధులను ఏర్పాటు చేసుకొని ఇంటింటికి వెళ్లి తమ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ అధికార పార్టీ ఉద్యోగాల కల్పన, పారిశ్రామికీకరణ, అభివృద్ధి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రజలలో కూడా వైసిపిపై కొంత నెగిటివ్ టాక్ ఉంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్ కి మరో రూపంలో కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఇప్పటికే నియోజకవర్గాలలో కొత్త నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైసీపీ నుంచి పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా, సీనియర్ నాయకులుగా ఉన్న వారు తమ వారసులను బరిలోకి దించాలని భావిస్తున్నారు. రాయలసీమలో చంద్రగిరి నియోజకవర్గం ఎమెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని ప్రకటించారు. అలాగే మచిలీపట్నంలో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీ చేస్తారంటూ ప్రచారం నడుస్తోంది. బొత్స సత్యనారాయణ తనయుడు కూడా ఎమ్మెల్యేగా 2024 లో ఎంట్రీ ఇవ్వ్వాలనే ఆలోచనతో ఉన్నారు.
వైసీపీలో ఇలా మొత్తం 40 మంది వరకు వారసులు అరంగేట్రం చేయడానికి ఆశపడుతున్నారు. నాయకులు కూడా తమ కొడుకులు లేదా కూతుళ్లకు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకోవడానికి విశ్వం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో జగన్ కాస్త ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ వారసులకు ఎమ్మెల్యే సీట్లు ఖరారు చేసి ఇస్తే వారు ఎంతవరకు ప్రభావం చూపిస్తారనేది అర్థం కాని విషయం. ప్రజల్లోకి వారు బలంగా వెళ్లలేకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది మరి దీనిపై ఫైనల్ గా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.