Soundarya : ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య ప్లెయిన్ యాక్సిడెంట్ లో చనిపోయినా ఇప్పటికీ మన మధ్యే ఉన్న ఫీలింగ్ ఉంటుంది. 90లలో తెలుగు తెరను ఏలిన అందాల రాశి సౌందర్య. ఆమె మరణం ఇండస్ట్రీలో ఇప్పటికీ తీరని విషాదమే. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ ఇలా ఎన్నో భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంది. ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో కొన్నేళ్ల పాటు సౌందర్య వెండి తెరను ఏలింది. సూపర్ స్టార్ కృష్ణ ,మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ఇలా ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆమె మరణించి దశాబ్దాలు గడిచినా ఇప్పటిక ఆమె జ్ఞాపకాలను పలువురు గుర్తు చేసుకుంటారు. సౌందర్యతో తమకున్న బాండింగ్ గురించి మాట్లాడుతుంటారు. ఎందుకంటే సౌందర్య కాంట్రవర్సీలకు దూరంగా సింప్లిసిటీతో బతికిన నటిగా అందరి మనసు గెలుచుకుంది. కానీ అనుకోని యాక్సిడెంట్ తో ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. తాజాగా సౌందర్య మరణంపై కన్నడ సీనియర్ హీరో రమేశ్ అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కన్నడలో టెలికాస్ట్ అయ్యే ఓ ప్రోగ్రామ్ లో హీరో రమేష్ అరవింద్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ తరుణ్ సుధీర్, అలనాటి హీరోయిన్ ప్రేమ, నిశ్విక నాయుడు కూడా జడ్జులుగా ఉన్నారు. లాస్ట్ వీక్ ఎపిసోడ్‌లో రమేష్ అరవింద్ నటి సౌందర్యను గుర్తు చేసుకున్నారు. నటి సౌందర్య చనిపోయిందని చాలా కాలం నమ్మలేకపోయానని ఆమన అన్నారు. చంద్రముఖ రీమేక్ ను కన్నడలో ఆప్తమిత్ర గ తీశారు. ఈ సినిమాలో రమేష్ అరవింద్ భార్యగా సౌందర్య కనిపించింది. చంద్రముఖి ఆవహించిన గంగ పాత్రలో సౌందర్య కనిపించి తన నటనతో అలరించింది. ఆమెతో కలిసి పనిచేయడం, ఆమె మరణం గురించి మరిన్ని విషయాలు పంచుకున్నారు రమేశ్. ” ఆప్తమిత్ర క్లైమాక్స్ సీన్ షూటింగ్ సమయంలో రంగోలిలో కమండలం వేశారు. అప్పుడు సౌందర్య యాక్టింగ్ ఎలా ఉందంటే నాగవల్లి ఆమెలో నిజంగానే పరకాయప్రవేశం చేసిందా అన్నట్లుగా అనిపించింది. ఆసీన్ లో ఆమెను అలా అందరం చూస్తుండిపోయాం. ఎలాంటి క్యారెక్టర్ అయినా సౌందర్య అద్భుతంగా నటించేది. కాదు కాదు జీవించేది. అయితే ఆమె అంత చిన్న విమానంలో ఎలా కూర్చుంది ? ఆమె ఎందుకు ఆ విమానం ఎక్కింది? ఎక్కడికి వెళ్లాలనుకుంది? అనే క్వశ్చన్స్ ఇప్పటికీ నాలోనే ఉండిపోయాయి.
నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు సౌందర్య మరణ వార్త విన్నాను. నేను నిజంగా నమ్మలేకపోయాను. వెంటనే ఆమె నెంబర్ కు కాల్ చేశాను. కానీ ఎవరూ రిసీవ్ చేసుకోలేదు. ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఆమెకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఈ న్యూస్ ఫేక్ అని ఆమె ఫోన్‌లో మరొకరితో మాట్లాడుతుందేమో అని మళ్లీ మళ్లీ కాల్ చేశాను. అయినా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు”అంటూ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ గా సౌందర్య ప్రచారం చేయడానికి రెడీ అయ్యింది. ఈ క్రమంలో తెలంగాణలోని కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనేందుకు సౌందర్య జూలై 7న బెంగుళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు . అయితే కాసేపటికే హెలికాఫ్టర్ ప్రమాదానికి గురయ్యింది.ఈ ప్రమాదంలో సౌందర్య హెలికాఫ్టర్ లోనే చనిపోయింది. సౌందర్యతోపాటు ఆమె సోదరుడు కూడా ఈ యాక్సిడెంట్ లో చనిపోయారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.