Spirtual: ప్రతినెలలో అమావాస్య తిథి వస్తుంది. ప్రతి అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం అమావాస్య, పౌర్ణమి అనేవి ఎంతో విశేషం కలిగి ఉన్న రోజులు. ఆయా రోజులలో దేవతారాధన ఉంటుంది. వీటిని cవిశేషంగా నమ్ముతారు. ఇప్పటికి చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వీటిని నమ్మేవారి సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగింది. అలాగే ప్రత్యేక తిథులలో పూజలు, వ్రతాలు ఆచరించడం కూడా చేస్తున్నారు.
సనాతన ధర్మంలో ఈ ఆచార వ్యవహారాలకి ప్రత్యేక విశేషం ఉంటుంది. వీటిని చాలా నియమ నిష్ఠలతో చేయాలి. ఇలా చేయడం వలన గత జన్మల కర్మల నుంచి విముక్తి లభించడంతో పాటు ఈ జన్మలో తెలిసి, తెలియక చేసిన పాపకర్మల నుంచి కూడా విముక్తి లభిస్తుందని, అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అరుదైన సందర్భాలు కూడా ఉంటాయి.
అలా ఈ నెల 30న వచ్చే అమావాస్యకి ప్రత్యేకత ఉంది. దీనిని సోమవతి అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య చాలా అరుదుగా వస్తుందని చెబుతున్నారు. ఈ రోజునే శని జయంతి, వట సావిత్రి వ్రతం కూడా రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుమారు 30 ఏళ్ల తర్వాత ఒకే రోజున మూడు పండుగలు రావడం ప్రత్యేకత అని చెప్పాలి. ఈ రోజున పరమశివుడిని ప్రత్యేకముగా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున మన పూర్వీకులని స్మరించుకుంటూ సామర్ధ్యం కొద్ది దానధర్మాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
అలాగే లక్ష్మీదేవి పూజ చేస్తే ఆర్ధిక సమస్యలు కూడా తొలగిపోతాయని అంటున్నారు. అలాగే ఈ రోజున రావిచెట్టుకి స్త్రీలు పూజలు చేసి, ప్రదక్షిణాలు చేస్తే ఎంతో శుభ ఫలితాలు పొందవచ్చని కూడా చెబుతున్నారు. అయితే నిష్ఠతో ఈ రోజులు పూజలు చేయడం ఎంత ముఖ్యమో అలాగే కొన్ని పనులకి దూరంగా ఉండటం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు. సోమవతి అమావాస్య రోజున మద్యం, మాంసం జోలికి వెళ్ళకూడదు. అలాగే జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు. రావిచెట్టుని పూజించే సమయంలో పొరపాటున కూడా చెట్టుని తాకకూడదు. అలాగే ఎవ్వరినీ దూషించకూడదు. ఇలా చెడుపనులు చేస్తే దుష్ఫలితాలు సంభవించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.