Simba: ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుంది.. ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుంది.. అనేది రీసెంట్‌గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమై ఉంటుంది. వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత నష్టాన్ని చవి చూశాయో అందరికీ తెలిసిందే. ప్రకృతిని కాపాడుకుంటే.. అది మనల్ని కాపాడుతుంది.. చెట్లను పెంచి.. చెరువుల్ని కబ్జాలు చేయకుండా ఉంటే.. ఇలాంటి ప్రకృతి విళయతాండవాలు జరగవు. వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో సింబా సినిమాను తీశారు.
సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం సింబా. మురళీ మనోహర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా థియేటర్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలాంటి మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రశంసలు వస్తాయి. కానీ థియేటర్లో ఆడియెన్స్ నుంచి అంతగా రెస్పాన్స్ రాదు.
కానీ అలాంటి చిత్రాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తే టాప్‌లో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా సింబా మూవీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఈ సింబా మూవీ గత పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 6లో సింబా చిత్రం ట్రెండ్ అవుతోంది. ప్రకృతి విళయతాండవం చేస్తున్న టైంలో సింబాలోని డైలాగ్స్, సీన్స్ బాగానే వైరల్ అయ్యాయి. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు.
డైరెక్టర్ మొదటి సినిమాతోనే మంచి మెసెజ్ ఇచ్చే చిత్రాన్ని తీశారు. సంపత్ నంది కథ.. డైరెక్టర్ మురళీ మనోహర్ విజన్, మేకింగ్ కు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. సింబాకి ఓటీటీలో ప్రస్తుతం మంచి ఆదరణ అయితే దక్కుతోంది. ఓటీటీలోకి కొత్త చిత్రాలు వస్తూ ఉన్నా కూడా సింబా ఇప్పటికీ టాప్‌లోనే ట్రెండ్ అవుతోంది.
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.