Simba: సంపత్ నంది కథతో మురళీ మనోహర్ దర్శకత్వంలో అనసూయ, జగపతిబాబు వంటి వారు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింబా. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే అనసూయ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ఎంపి సంతోష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ఇప్పటివరకు ఎవరు ఇవ్వని ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు వారి స్వార్థం కోసం చెట్లను విపరీతంగా నరికేస్తున్నారు.
ఇలా చెట్లను నరకడం వల్ల ఎన్నో రకాల సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము ఇలా చెట్టు నరికిన వారు దాని స్థానంలో మరో మొక్కను నాటడం మర్చిపోతున్నారు. తద్వారా ప్రకృతి ఆగ్రహానికి మనం గురి అవుతున్నాము. ఇటీవల కేరళ వయనాడ్ లో ప్రకృతి విలయతాండవం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్తులు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని రక్షించుకోవాలని వెల్లడించారు.
ఇలా పర్యావరణాన్ని రక్షించడంలో మొక్కలు కీలక ప్రాధాన్యత పోసిస్తాయి కనుక పర్యావరణాన్ని కాపాడే విషయంలో ఎవరైతే మొక్కలు నాటి తమకు మెసేజ్ చేస్తారో అలాంటి వారికి ఈ సినిమా టికెట్ ఫ్రీగా ఇస్తానని నటుడు శ్రీనాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా మొక్కలు నాటితే ఈ సినిమా టికెట్ అందుకోవచ్చాని ఈయన వెల్లడించడంతో ఈయన ఇచ్చిన బంపర్ ఆఫర్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
This website uses cookies.