Mahalaya Paksham:భాద్రపదమాసంలో శుక్లపక్షంలో వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఇక బహుళపక్షంలో కృష్ణపక్షం పితృకార్యాలకు విశేషం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షముగా పిలుస్తారు. ఏడాదికి 12 అమావాస్యలుంటాయి. కానీ, భాద్రపద అమావాస్యకు ఎంతో విశిష్ఠత ఉన్నది. ఈ ఏడాది ఈ నెల 18 నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై.. అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను స్మరించుకోవడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ మహాలయపక్షంలో ప్రతిరోజు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం ఎదుట లోపల నిలబడి చేతులను జోడించి.. పితృ దేవతలను సర్మించుకోవాలి.తద్వారా ఆయుః ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక పితృదేవతలకు పిండ ప్రధానలు చేయడానికి మహాలయ పక్షం ఎంతో శుభమైనదని పండితులు చెబుతున్నారు. ఈ పక్షం రోజుల్లో పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను తప్పనిసరిగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. కుదరి పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథిరోజైతే కన్నుమూశారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. ఒకవేళ తిథి రోజున వీలు కాకపోయినా అమావాస్య రోజున పిండ ప్రధానాలు చేయడం మంచిది.
ఇలా ఈ మహాలయ పక్షంలో మరణించిన మన పెద్దవారిని స్మరించుకొని వారికి తర్పణాలు చేయటం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది. అలాగే వారి ఆశీస్సులు కూడా మనపై ఉండి మనపై ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ 15 రోజులు ఎంతో నియమ నిష్టలను పాటిస్తూ పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో మంచిది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.