Shruti Haasan : సినీ ఇండస్ట్రీలో ఎవ్వరి రాత ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎవరికి ఎప్పుడు అదృష్టం వరిస్తుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ ఆ లక్కు చేతికి చిక్కినప్పుడు మాత్రం దానిని సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఇప్పుడు సౌత్ సెన్సేషనల్ నటి శృతి పరిస్థితి కూడా ఇదే. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతి హాసన్ కు వరుసగా ఆఫర్లు తలుపు తడుతున్నాయి. అమ్మడు సెకెండ్ ఇన్నింగ్స్ లో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సలార్ మూవీలో అమ్మడు నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ తప్ప మరో ప్రాజెక్ట్ లేదని ఇప్పటి వరకు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. కానీ లేటెస్టుగా ఈ అమ్మడు నక్కతోక తొక్కినట్లైంది. కేజీఎఫ్ మూవీతో ఇండియాను ఓ ఊపు ఊపేసిన ఎనర్జిటిక్ స్టార్ యష్ తో రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది ఈ బ్యూటీ.
కడన్న ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. కేజీఫ్ తో పాటు కేజీఎఫ్ సీక్వెల్ కూడా అదే స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి కలెక్షన్లలో రికార్డులను సృష్టించింది. ఈ మూవీలో యష్ యాక్షన్ కు ఇండియా మొత్తం ఫిదా అయిపోయింది. ఎవ్వరి నోట విన్నా రాఖీ భాయ్ పేరే వినిపించింది. అంతటి మానియాను క్రియేట్ చేశాడు యష్. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ సీక్వెల్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న యష్ మరో పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. కేవీఎస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ యష్ కు 19 వ చిత్రం. గీతు మోహన్ దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను టాక్సీ అని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ కూడా చేశారు. ఇదే సినిమాలో సలార్ బ్యూటీ శృతి హాసన్ నటించే ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ సాయిపల్లవిని ఒక నటిగా తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారట. అందులో భాగంగానే లేటెస్టుగా మరో హీరోయిన్ గా శృతిహాసన్ ను సెలెక్ట్ చేసినట్లు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మూడో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది.
ఇప్పటికే శృతి టాలీవుడ్ థ్రిల్లర్ చిత్రాలకి బ్రాండ్ గా మారిన అడవిశేష్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. క్షణం, ఎవరు, గుఢాచారి సినిమాల మాదిరిగానే మరో థ్రిల్లర్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సారి అడవి శేష్ కి జోడీగా శృతిహాసన్ సెలెక్ట్ అయ్యింది. శృతిహాసనే తన ట్విటర్ అకౌంట్ లో అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేసి విషయాన్ని పంచుకుంది. #SeshEXSruthi అనే హ్యాష్ టాగ్ ని ఉపయోగించిన పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో అడవిశేష్ డిఫరెంట్ గా కనిపించాడు. పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. థ్రిల్లర్ మూవీ కదా ఆ మాత్రం ఉంటుందని నెటిజన్స్ అంటున్నారు. అన్నపూర్ణ ప్రొడక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీని సుప్రియా యార్లగడ్డ ప్రొడ్యూజ్ చేస్తోంది. సానియెల్ డియో మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.