Shriya Saran : శ్రియా శరణ్ భారతీయ వినోద పరిశ్రమలో ఉన్న అత్యంత అందమైన, ప్రతిభావంతులైన నటి. దక్షిణ ప్రాంతీయ వినోద పరిశ్రమలో తమ కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగింది. సుమారు 20 ఏళ్లుగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తూ నటనతో అందంతో సినీ ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.. శ్రియా శరణ్ దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుండి విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలను సాధించింది. పాన్-ఇండియా సినిమాలలో చేయకపోయినా, ప్రజల నుండి ప్రశంసలను పొందుతోంది.
శ్రియా శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫాన్స్ ను పలకరిస్తూ ఖుషీ చేస్తూ ఉంటుంది. అందమైన ఫోటోషూట్లతో అదిరిపోయే లుక్స్ లో కనిపించి తన అందాలతో అందరి హృదయాలను దోచేస్తుంది శ్రియ. తాజాగా అదిరిపోయే తెల్ల రంగు షరారా సెట్ లో అద్భుతమైన ఫోటోషూట్ చేసి ఆ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.
తాజా ఫ్యాషన్ ప్రకటన ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. ఒకవేళ, మీరు ఎత్నిక్ వేర్‌పై కొన్ని అద్భుతమైన ఆలోచనలను తెలుసుకోవాలనుకుంటే, సౌత్ బ్యూటీ శ్రియ శరణ్‌ని ఫాలో అవ్వాల్సిందే. ప్రస్తుతం తన చిత్రం కబ్జా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న నటి, తన కొత్త ఫ్యాషన్ ఫోటోషూట్ పిక్స్ ను నెట్టింట్లో షేర్ చేస్తూ ఫ్యాషన్ తో ప్రమోషన్స్ చేస్తోంది.
తాజా ఫోటో షూట్ కోసం శ్రియ పాయల్ సింఘాల్ డిజైన్ చేసిన అద్భుతమైన ఎత్నిక్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది . ఎత్నిక్ అవుట్ ఫిట్ అయినప్పటికిటీ పాశ్చాత్య శైలిని మేలవించి డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్ శ్రియకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఆమె తెల్లటి ప్యాంటుతో కూడిన అందమైన ఆఫ్-వైట్ కలర్ జార్జెట్ టై-అప్ చోలీని ధరించింది. పసుపు, గులాబీ ,నీలం రంగులలో బహుళ-రంగు ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిన బ్లౌజ్ ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు డిజైనర్. స్లీవ్‌లెస్ చోలీకి బార్డర్‌ల వద్ద రంగురంగుల అంచు డిజైన్‌లు ,వెనుక భాగంలో స్ట్రింగ్‌లు హైలెట్ గా నిలిచాయి.
ఈ అద్భుతమైన ఎత్నిక్ అవుట్ ఫిట్ కు అదిరిపోయే జ్యువెల్లరీని పెట్టుకుంది. శ్రియ తన చెవులకు స్టడ్‌లను యాక్సెసరీస్‌గా జోడించింది. ఆమె జుట్టు లూజ్ గా వదులుకుని కెమెరాకు క్రేజీ లుక్స్ ఇచ్చింది. మహేంద్ర శ్రియ అందాలకు మరిన్ని మెరుగులు దిద్దాడు. ప్రియాంక శేఖర్ అందమైన హెయిర్ స్టైల్ ను శ్రియకు అందించింది.
శ్రియ తన కనులకు ఐలైనర్, మస్కరా దిద్దుకుని ఆమె పెదవులపై గులాబీ రంగు లిప్ స్టిక్ ను దిద్దుకుని తన అందాలతో అందరి హృదయాలను దోచేసింది. కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. కబ్జా మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ అవుట్ ఫిట్ తోనూ ప్రమోషన్స్ చేస్తోంది ఈ భామ.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.