Spirtual: ఈ ప్రపంచంలో మనతో పాటు కోట్లాది మంది ప్రజలు జీవిస్తున్నారు. మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. మనం కూడా అందరితో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రయాణంలో, మన ఆలోచనలలో, మన జీవితంలో ప్రతి రోజు ఎంతో మంది భాగం అవుతారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారితో కలిసి మనం ప్రయాణం సాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా అన్ని విషయాలకి ఇతరుల మీద ఆధారపడి జీవితాన్ని ముందుకి తీసుకొని వెళ్తున్నాం. ఎవరైనా ఈ భౌతికపరమైన ప్రపంచంలో లక్ష్యాన్ని వెతుక్కుంటూ ముందుకి వెళ్తున్నారు అంటే కచ్చితంగా వారికి ఎంతో మంది సహకారం కచ్చితంగా లభించి ఉంటుంది.
ఈ నా ప్రయాణంలో ఎవరు తనకి సహకరించలేదు. ఈ గెలుపు నా సొంతం. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు నాకు నేనుగా వేసినదే. ఇంత వరకు వచ్చానంటే అది నా సామర్ధ్యాన్ని నమ్ముకొని వచ్చాను అన్నారంటే కచ్చితంగా అబద్ధం చెబుతున్నారు అని అర్ధం. ఎందుకంటే ఒక అల్టిమేట్ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకి వెళ్తున్న మన ప్రయాణంలో విజయాన్ని అందుకునే మార్గంలో ఎంతో మంది సహకారం ఎన్నో రకాలుగా ఉంటూనే ఉంటుంది. అయితే దానిని గుర్తుంచడంలో లక్ష్యం సాధించిన మనం వెనుకబడిపోతాం.
ఈ విశ్వంలో ఉన్న ప్రపంచం గురించి అర్ధం చేసుకోవాలంటే సాధారణమైన ఆలోచన సరిపోదు. ఆధ్యాత్మిక అన్వేషణ అవసరం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న మన స్థితిని, ఉనికిని అర్ధం చేసుకోవడానికి మనతో మనం ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ ఒక్కరు మనకి సహాయం చేయలేరు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గురువుల దగ్గరకి వెళ్లిన, బాబాలని కలిసిన వారు కూడా ఈ భౌతికపరమైన జగత్తులో మానవ సమాజంతో సంబంధం కలిగి ఉండటం వలన అల్టిమేట్ ఐడెంటిటీ గురించి వారి నుంచి లభించే సహకారం పెద్దగా ఉండదు.
భౌతికపరమైన కోరికలకి, ఆశలపై కారణం అయిన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ధ్యాన మార్గంలోకి వెళ్ళాలి. మనల్ని మనం లోతుగా శోధించాలి. అంటే కేవలం మన స్పిరిచ్యువల్ ఐడెంటిటీ కోసం మనతో మాత్రమే మనం ప్రయాణం చేయాలి. ఒంటరిగా మనం ప్రయాణం ఉండాలి. ఒక వేళ ఈ అన్వేషణలో వేరొకరి సహకారం తీసుకుంటే అంతిమంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడం మరింత ఆలస్యం అవుతుంది. అందుకే యోగులు, అఘోరాలు, మహర్షులు ఈ జనావాసానికి దూరంగా ఉంటారు.
అలాగే కొంత మంది ఈ ప్రపంచంలో జనంలోనే ఉన్నా కూడా వారిదైనా ప్రపంచంలో ఒంటరిగానే ఎక్కువగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఒంటరితనం ఈ ప్రపంచం గురించి ఎవరికీ తెలియని సత్యాన్ని తెలియజేస్తుంది. ఒంటరితనం ఈ ప్రపంచంలో ఎవరికి అర్ధం కానీ ఒక తత్వాన్ని ప్రభోధిస్తుంది. అలా ఒంటరితనంతో స్పిరిచ్యువల్ ఐడెంటిటీ పొందిన వారిని చూసుకుంటే వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, పరమహంస యోగానంద, సద్గురు బాబాజీ, షిరిడీ సాయి. ఇలాంటి వారిని ప్రపంచం ఎప్పటికి గుర్తుపెట్టుకోవడానికి కారణం వారు నిజమైన ప్రపంచాన్ని అర్ధం చేసుకున్నారు.
ఈ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటో తెలుసుకున్నారు. భక్తి వేరు ఆధ్యాత్మిక శక్తి వేరు అనే విషయాన్ని స్పష్టంగా ఈ ప్రపంచంలో ఉన్న వారికి చెప్పే ప్రయత్నం చేశారు. మనతో మనం ఒంటరిగా చేసే ప్రయాణంతోనే నిజమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకోగలం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.