Spirituality: సాధారణంగా మనం ప్రతిరోజు మన ఇంట్లో పూజ కార్యక్రమాలను ఎంతో నియమనిష్టలతో పాటిస్తూ ఉంటాము అయితే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వారి ఇష్ట దైవారాధనను చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే చాలామంది శివుడి భక్తులు కూడా ఉంటారు. ఇలా శివయ్య భక్తులు ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని పూజిస్తూ ఉంటారు అయితే ఇంట్లో శివలింగం ఉంది అంటే సాధారణంగా పూజలు చేయకూడదు చాలా నియమనిష్టలతో పూజ చేయాల్సి ఉంటుంది శివలింగాన్ని పూజించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. మరి శివలింగం పూజించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయానికి వస్తే..
పూజ చేయడానికి ముందు మనం శుభ్రంగా స్నానం చేస్తాము అయితే శివుడికి పూజ చేసే సమయంలో స్నానం చేసిన తర్వాత మన నెత్తిపై కాస్త గంగాజలం చల్లుకోవాలి అలాగే మన ఇంటి లోను ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలలో కూడా గంగాజలం చల్లిన తర్వాత శివలింగానికి పూజ చేయాలి.శివలింగంను దాని స్థానంలో పెట్టేటప్పుడు పాదాలను తాకి, ఆ తర్వాత ఒక గిన్నెలో శివలింగాన్ని పెట్టి దానిలో గంగా జలం కలిపిన నీటిని పోయాలి. ఒకవేళ రాతి రూపంలో ఉంటే, గంగా జలంతో శుభ్రం చేయాలి.
ఈ విధంగా శివలింగాన్ని గంగాజలంతో శుభ్రం చేసిన తర్వాత పసుపు కుంకములు పెట్టకుండా కేవలం చందనం కలిపి మూడు అడ్డ నామాలను పెట్టాలి.ఇంటిలో శివలింగంను పెట్టినప్పుడు బంగారు, వెండి లేదా ఇత్తడితో తయారు చేసిన నాగ పడగలో ఉంచాలి. ఇంట్లో శివలింగం ఉంది అంటే తప్పనిసరిగా జలధార కూడా ఉండాలి ఇలా జలధార లేదు అంటే ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.శివలింగంను ఎప్పుడు ఒంటరిగా ఉంచకూడదు. శివుని పక్కన బంకమట్టితో చేసిన గౌరీ మరియు వినాయకుడు ఉండాలి. ఇక ప్రతిరోజు శివుడికి పూజ చేయాలి అలాగే తెల్లటి పుష్పాలతో పూజ చేయడం ఎంతో మంచిది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.