Shivalingam: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎంతోమంది పెద్ద శివుడిని పూజిస్తూ ఉంటారు. ఇలా చాలామంది ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని రాగా మరికొందరు అభిషేకాలు అర్చనలు చేయిస్తుంటారు. అయితే చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు.మరికొందరు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తుంటారు.శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే మంచిదేనా ఇంట్లో పెట్టుకుంటే ఎలా పూజ చేయాలి అనే విషయానికి వస్తే..
శివలింగాన్ని ఇంట్లోంచి పూజించాలి అనుకునేవారు ప్రధానంగా శివలింగం ఎత్తు కేవలం అంగుష్టమాత్రం పరిమాణం ఉంటే మంచిది. అంటే మన బొటనవేలు కన్నా పెద్ద పరిమాణంలో ఉన్న శివలింగం ఇంట్లో ఉంచరాదు. ఇక ఇంట్లో ఎన్ని శివలింగాలు ఉండవచ్చు అనేది చాలామందికి అనుమానం ఉంటుంది. ప్రతిరోజు నిష్టగా వేద మంత్రాలతో అభిషేకం చేయగలిగితే.. ఇంట్లో రెండు శివలింగాలైనా ఉంచుకోవచ్చు..ఇలా ఇంట్లో శివలింగాన్ని పెట్టుకున్న తర్వాత క్రమం తప్పకుండా ప్రతిరోజు అభిషేకార్చనలు చేయాలి. కానీ, ఇంట్లో ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంటుంది.
అందుకే శివలింగానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన శ్రేయస్కరం. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాలి. ఇలా ప్రతిరోజు పూజ చేయడం కుదరని వారు వాటిని ఏదైనా శివాలయంలో సమర్పించవచ్చు. అయితే శుచి, శౌచం పాటించాలి. వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మృత్తికతో అప్పటికప్పుడు మట్టితో పార్థివ లింగం తయారుచేసుకుని శివుని అర్చించవచ్చు. ఇలా శివలింగం ఉన్నవారు నిత్యం భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి పూజలు చేయాలి. లేకపోతే శివుడి ఆగ్రహానికి గురై ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…
Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…
Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…
Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…
Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…
This website uses cookies.