Sharukh Khan : బాలీవుడ్ లో తాజాగా విడుదల అయిన పఠాన్ మూవీ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో సంభాషించే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు. సూపర్ స్టార్ తన ఈ వీక్ ఎండ్ లో #AskSRK సెషన్‌తో ముగించారు. ఎప్పటిలాగే ఈ సంభాషణ వినోదాత్మకంగా సాగింది. పఠాన్ మూవీకి సంబంధించిన విషయాలను , సినిమా విజయంపై అతని కుటుంబం స్పందన, ప్రస్తుతం సెట్స్ లో ఉన్న జవాన్ మూవీ వివరాలతో పాటు, విజయ్ సేతుపతి, నయనతార తో వర్క్ షేరింగ్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు షారుఖ్ సమాధానమిచ్చారు.
అట్లీ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి పని చేయడం గురించి ఒక అభిమాని అడిగినప్పుడు, షారూఖ్ ఖాన్ అతనితో పని చేయడం అద్భుతంగా ఉందని కానీ అతనికి కొంచెం మెంటల్ అని ఫన్ ని జోడించి చెప్పాడు. మరో ట్విటర్ యూజర్ జవాన్‌లో నయనతార మేమ్‌తో కలిసి పని చేయడం ఎలా అనిపిస్తుంది? మేడమ్ గురించి ఏదైనా ప్రత్యేకత ఉందా? అని ప్రశ్నించగా దీనికి షారుఖ్ ఖాన్ స్పందిస్తూ, ఆమె చాలా స్వీట్. అన్ని భాషలు చాలా బాగా మాట్లాడుతుంది, ఆమె ఈ చిత్రంలో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన సంగీతం గురించి షారుఖ్ ఖాన్ ప్రత్యేకంగా స్పందించారు. అనిరుధ్ తెలివైనవాడు…ఫుల్ ఎనర్జీ తో పాటు మంచి ఫన్ కలిగిన వ్యక్తి. ఇంత చిన్న వయస్సులో అతనితో పనిచేస్తున్న యువకుల బృందం చాలా బాగుంది అని అనిరుద్ ను పొగడ్తలతో ముంచేశారు.
పఠాన్ మూవీ భారీ విజయం తర్వాత, షారుఖ్ అభిమానులు అతని తదుపరి మూవీ జవాన్ ఇదే విధమైన బాక్సాఫీస్ హిట్ ను అందించాలని ఆశిస్తున్నారు. ఇటీవల, ఈ సినిమా సెట్స్ నుండి షారుఖ్ ఖాన్ తెరవెనుక ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యింది.
పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.13.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. భారతదేశంలో హిందీ వెర్షన్ మొత్తం కలెక్షన్స్ రూ. 364.50 కోట్లకు చేరుకుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.