Sharukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 2023లో పఠాన్, జవాన్ ,డుంకీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. వరుస హ్యాట్రిక్ హిట్లతో షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేశారు. దీంతో ఫ్యాన్స్ షారుఖ్ తదుపరి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షారుఖ్ తన నెక్ట్స్ మూవీ సుజోయ్ ఘోష్ తో చేయబోతున్నాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు జరగలేదు. ఖాన్ ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఈ క్రమంలో తన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయకపోవడంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు షారుఖ్. సినిమాలకు కాస్త విరామం ఇచ్చి విశ్రాంతి కోరుకున్నట్లు చెప్పారు.
ఇంటర్వ్యూ లో షారుఖ్ మాట్లాడుతూ.. “గతేడాది సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాను. రెస్ట్ లేకుండా పనిచేశాను. నా శరీరాన్ని చాలా కష్టపెట్టాను. అందుకే కాస్త రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాను. అంతేకాకుండా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రతి మ్యాచ్‌కు వస్తానని ప్లేయర్స్ కు ప్రామిస్ చేశాను. అందుకే నా నెక్స్ట్ మూవీ ని జూన్, ఆగస్టులో ప్లాన్ చేశాను. ఆరు నెలల విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను” అని షారుఖ్ తెలిపారు.
ఇదే ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు షారుక్.. “కోహ్లీ అనుష్క శర్మ నాకు బాగా తెలుసు. విరాట్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను అనుష్కతో మూవీస్ చేస్తున్నప్పటి నుంచి విరాట్ నాకు తెలుసు. మేము చాలా ఫ్రెండ్లీ ఉంటాం. విరాట్ చాలా మంచివాడు” అని చెప్పారు షారుఖ్.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.