Shani Dosham: సాధారణంగా అందరి దేవుళ్లకు భక్తితో దండం పెడతారు. కానీ శని దేవుడికి మాత్రం భయంతో దండం పెడతారు. ఎందుకంటే శని దేవుడిని పూజించేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అయితే కొంతమంది శని దోషం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటివారు ఈనెల 19న శనిజయంతి రోజున శని దేవున్ని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభించడమే కాకుండా శని దోషం కూడా తొలగిపోతుంది. శనీ జయంతి రోజున శని దేవుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శని జయంతి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానమాచరించి శని దేవుడి విగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి. ఆ తర్వాత పూలతో అలంకరించి,నల్ల మినప్పప్పు, నల్ల నువ్వులు నైవేద్యంగా శని పాదాల వద్ద సమర్పించాలి. ఆ తర్వాత దీపం వెలగించి శనిచాలీసా చదువుకోవాలి. అలాగే ఆ రోజంతా ఉపవాసం ఉండడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది.
శని జయంతి రోజున దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్య ఫలం దక్కుతుంది . అలాగే పేదలకు అన్నదానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఎదురైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల క్షణ జయంతి రోజున పేదలకు సహాయం చేయడం చాలా మంచిది. ఇక శని జయంతి రోజున సాయంత్రం పడమటి దిశలో దీపం వెలిగించాలి. ఓం శని శనైశ్చరాయ నమ: అంటూ జపం చేయాలి.
Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.