ShahRukh Khan – Deepika Padukone : ఒంగి మరీ షారుఖ్ ఖాన్‌కి ముద్దు పెట్టిన దీపిక..సోషల్ మీడియాలో వీడియో వైరల్..

ShahRukh Khan – Deepika Padukone :  సినిమా విడుదలకు ముందు మీడియా ఇంటరాక్షన్‌లకు దూరంగా ఉన్న పఠాన్ స్టార్స్, సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో సోమవారం సాయంత్రం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. పఠాన్ హీరో షారూఖ్ ఖాన్ , హీరోయిన్ దీపికా పదుకొనే, విలన్ జాన్ అబ్రహం, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ లు స్టేజ్‌ను అలంకరించి తమ అభిమానులను అలరించారు. ఇక కింగ్ ఖాన్ షారుఖ్ ఈవెంట్‌కి రావడంతో అభిమానులు ఏకంగా “వి లవ్ షారూఖ్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపిన షారుఖ్‌.. సినిమాకు మళ్లీ ప్రాణం పోసినందుకు ధన్యవాదాలు అని ఈ మీడియా ఇంటరాక్షన్‌లో అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకొణె భావోద్వేగానికి గురైంది.

shahrukh-khan-deepika-padukone-video-going-viral-on-social-media-kissing-shahrukh-khan

ఇక ఈ ఇంటరాక్షన్‌లో భాగంగా షారుఖ్, దీపిక , జాన్ అబ్రహాం ముగ్గురూ ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించారు. వీరు ముగ్గురు ప్రేమతో ముద్దులు పెట్టుకునే సీన్‌లను తమ కెమెరాల్లో బంధించారు వీడియోగ్రాఫర్లు. ఇంకేముందు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ కిస్సింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు వీరి ప్రేమకు ఫిదా అయిపోయారు . విలేకరుల సమావేశంలో వారు తమ సహనటులను ప్రశంసించడమే కాకుండా ముద్దుల వర్షం కురిపించడం అభిమానులు అందరినీ ఆనందంలో ముంచింది.

shahrukh-khan-deepika-padukone-video-going-viral-on-social-media-kissing-shahrukh-khan

పఠాన్ సక్సెస్ మీట్‌ల సమయంలో, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జాన్ అబ్రహం ఒకరి చెంపలపై మరొకరు ప్రేమను చాటుకోవడం కనిపించింది. ఫోటోగ్రాఫర్లకు పోజులు ఇచ్చేప్పుడు దీపికా షారుఖ్ చెంపపై ప్రేమతో ముద్దు పెట్టుకుని దీపికా అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది. అసలే దీపిక హీరోకు సమానంగా పొడవుగా ఉంటుంది. అందులోనూ హై పాయింటెడ్ హీల్స్ వేసింది. ఇక షారుఖ్‌ను దీపికా హైట్ ఒవర్‌కమ్ చేయడంతో వంగి మరీ షారుఖ్‌కు ప్రేమతో ముద్దుపెట్టుకుంది దీపికా. ఇక షారుఖ్ జాన్ అబ్రహాంను ముద్దు పెట్టుకుని తన హ్యాపీనెస్‌ను షేర్ చేశాడు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు మీమ్‌లు పోస్ట్ చేస్తున్నారు.

shahrukh-khan-deepika-padukone-video-going-viral-on-social-media-kissing-shahrukh-khan

ఇదిలా ఉండగా కార్యక్రమాన్ని మంచి రసవత్తరంగా సాగించారు షారుఖ్‌. 2007లో దీపికా తో కలిసి మొదటిసారి నటించిన ఓం శాంతి ఓం చిత్రం నుంచి మైన్ అగర్ కహూన్ పాటను రొమాంటిక్‌గా పాడాడు షారుఖ్‌. పఠాన్ సెట్స్‌లో షారుఖ్‌ మీ కోసం ఈ పాట పాడారా అని దీపికను అడిగినప్పుడు, ఆమె లేదు, ఈసారి అతను సెట్స్‌లో నాకు పిజ్జాలు తినిపించాడు అని బదులిచ్చింది. దురదృష్టవశాత్తు, నేను చాలా కఠినమైన డైట్‌లో ఉన్నాను కాబట్టి నేను పిజ్జాలు తీసుకోలేకపోయాను అని చెప్పింది. షారుఖ్ ఖాన్ కూడా నటి కోసం ఆంఖోన్ మే తేరీ అని పాడటం మొదలుపెట్టాడు. దీపికా పదుకొణెతో తన కెమిస్ట్రీ గురించి, షారుఖ్‌ ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. మీకు తెలుసా నాకు దీపికకు రొమాన్స్ చేయడానికి, కౌగిలించుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి ఒక సాకు కావాలి అని అందరినీ అవాక్కు చేశాడు. కాబట్టి మీరు నన్ను ఏ ప్రశ్న అడిగినా, నేను దీపికా పదుకొనే చేతిని ముద్దు పెట్టుకుంటాను అదే సమాధానంగా ఉంటుంది అని అన్నాడు.

shahrukh-khan-deepika-padukone-video-going-viral-on-social-media-kissing-shahrukh-khan

ఇక షారుఖ్‌తో తన కెమిస్ట్రీ గురించి అడిగినప్పుడు, దీపిక ఇలా చెప్పింది, మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పాత్రలు చాలా భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. మా ఇద్దరి మధ‌య సంబంధం. మేము పంచుకునే ప్రేమ , నమ్మకం, అతని పట్ల నాకు చాలా గౌరవం ఉందని, కళాకారుడిగా మానిషిగా కూడా అని దీపికా భావోద్వేగంగా బదులు ఇచ్చింది. అసలు షారుఖ్ లేకపోతే తాను ఇక్కడ ఉండేదానిని కాదని దీపికా తెలిపింది. అతను నాకు అమితమైన నమ్మకాన్ని ఇచ్చాడంతి.

పఠాన్ షారుఖ్‌, దీపికా పదుకొణె కలసి చేస్తున్న నాల్గవ ప్రాజెక్ట్. దీపికా పదుకొణె 2007లో ఓం శాంతి ఓమ్‌లో షారుఖ్ ఖాన్ సరసన నటించిబాలీవుడ్‌లో మొదటిసారి అడుగుపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరూ హ్యాపీ న్యూ ఇయర్ ఆ తరువాత చెన్నై ఎక్స్‌ప్రెస్‌లలో కలిసి నటించారు ఈ సినిమాలన్నీ కూడాబాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. ఇప్పుడు పఠాన్‌ కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది.

Sri Aruna Sri

Recent Posts

Ananya Nagalla: “లీసా” నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది..

Ananya Nagalla: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం "లీసా". వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…

9 hours ago

Prabhas-Spirit: సందీప్ రెడ్డి వంగ రేంజ్‌ ఇది..

Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…

2 days ago

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

1 week ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

2 weeks ago

This website uses cookies.