Keerthi Suresh : కీర్తి సురేష్ తన పెళ్ళి వార్తలపై ఆ ఇద్దరిదీ ఒక్కో మాట..?

Keerthi Suresh : మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ రేంజ్‌ మారిపోయింది. అప్పటి వరకు కీర్తికి నటనే రాదన్న వారు ఇప్పుడు ఆమెను మహానటి అని మెచ్చుకుంటున్నారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో దాదాపు స్టార్ హీరోలందరితో నటించి, తనదైన వైవిధ్యమైన నటనతో అందంతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది కీర్తి సురేష్‌. బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు అందివచ్చినా సౌత్‌కే పరిమితమై ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది.

keerthi-suresh-social-media-gossips-about-keerthi-marriage

అయితే గత కొన్ని సంవత్సరాలుగా, నటి కీర్తి సురేష్ వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నటి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందని తన చిన్ననాటి ఫ్రెండ్ ని లవ్ మ్యారేజ్ చేసుకోబోతోందన్న పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

keerthi-suresh-social-media-gossips-about-keerthi-marriage

గత సంవత్సరం, కీర్తి సురేష్ వివాహం గురించి ఇదే విధమైన పుకారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఆమె అభిమానులను ఒక్కసారిగా అవాక్కయ్యారు. గతంలో ఈ 29 ఏళ్ల బ్యూటీ కోలీవుడ్‌లో తన సంగీతంతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో కలిసి ఏడు అడుగులు వేయబోతోందన్న ఊహాగానాలు వ్యాపించాయి. అప్పడు, కీర్తి సురేష్ ఇది కేవలం గాసిప్ అని ఈ వార్తలో వాస్తతం లేదని కొట్టిపారేసింది. నా వివాహానికి సంబంధించిన పుకార్లు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయని ఓ ఇంగ్లీషు పేపర్ ఇంటర్వ్యూలో పేర్కొంది, అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయోనని ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే, దాని గురించి చెప్పే మొదటి వ్యక్తిని నేనే అవుతాను అని చెప్పుకొచ్చింది. నా పెళ్లి గురించి ఊహాగానాలు మానుకోవాలని అందరినీ కోరుతున్నాను అని ఓ . నేను ఇప్పుడు నా పనిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించానని అప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పేసింది.

keerthi-suresh-social-media-gossips-about-keerthi-marriage

అయితే మరోసారి సోషల్ మీడియాలో కీర్తి పెళ్లి పుకార్లు మొదలయ్యాయి. తన చిన్ననాటి ఫ్రెండ్ ని లవ్ మ్యారేజ్ చేసుకోబోతోందన్న పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ తల్లి నటి మేనక కీర్తి పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది. తన కూతురి పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లని అలాంటిది ఏమీ లేదని ఈ విషయాన్ని కండించింది మేనక. కీర్తి సురేష్ కూడా ఈ వార్తలపై ప్రజంట్ ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే కొంత మంది మాత్రం నిప్పులేనిదే పొగ రాదుకదా అని అంటుంటే మరికొందరేమో మూవీ ప్రమోషన్ కోసం ఇలాంటి గాసిప్స్ పుట్టిస్తున్నారని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

keerthi-suresh-social-media-gossips-about-keerthi-marriage

వృత్తిపరంగా, కీర్తి సురేష్ గత కొంత కాలంగా కమర్షియల్ చిత్రాలను చేస్తోంది. అందులో కొన్ని హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటే మరికొన్న ఫ్లామ్‌లను మూటగట్టుకున్నాయి. అయినా కూడా ఈ అమ్మడి దూకుడు తగ్గలేదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తోంది ఈ బ్యూటీ. సమ్మర్ లో దసరా సినిమాతో థియేటర్స్‌లో సందడి చేయబోతోంది కీర్తి సురేష్‌. ఈ సినిమాలో మాస్ రోల్ ప్లే చేస్తోంది ముద్దుగుమ్మ. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది కాక కీర్తి సురేష్ సైరన్, రివాల్వర్ రీటా మంటి చిత్రాల్లో నటిస్తోంది.

keerthi-suresh-social-media-gossips-about-keerthi-marriage
Sri Aruna Sri

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

21 hours ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

21 hours ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

2 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

2 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

3 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

3 days ago

This website uses cookies.