యశోద సినిమాతో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టార్ హీరోయిన్ సమంత ఈ ఏడాది శాకుంతలం మూవీతో ప్రథమార్ధంలోనే ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది. భారీ బడ్జెట్ తో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో శకుంతల దుష్యంతుడి ప్రేమకావ్యంగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అలాగే శాకుంతలం సినిమాలో పాటలు కూడా ఈ మూవీపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఫిబ్రవరి 17న పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా త్రీడీలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతుంది. ఇక సమంత కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కంటెంట్ మహాభారతం నుంచి తీసుకోవడంతో కచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పక్కాగా గుణశేఖర్ ఈ మూవీని సిద్ధం చేస్తున్నారు. యశోద సినిమాతో 50 కోట్లకి పైగా సమంత కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ కచ్చితంగా వంద కోట్లని అందుకుంటుంది అని భావిస్తున్నారు.
దిల్ రాజు కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామ్యం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ ఇప్పుడు మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. గత ఏడాదిలోనే శాకుంతలం రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మరోసారి పెర్ఫెక్షన్ కోసం గుణశేఖర్ మరింత వర్క్ చేస్తూ ఉండటంతో సినిమాని మార్చికి వాయిదా వేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం నడుస్తుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో రిలీజ్ డేట్ కి సమయం తక్కువగా ఉండటంతో ప్రమోషన్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ తో ప్రమోషన్ చేస్తున్నా కూడా ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండటంతో వాయిదా వేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం నడుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.