Nagarjuna : అక్కినేని నాగార్జునకి ఇటీవల కాలంలో హిట్ అనేది దక్కింది లేదు. ఏ సినిమా చేసినా కూడా అది బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతోంది. మన్మధుడు 2, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి. బాలీవుడ్‌లో చేసిన బ్రహ్మాస్త్ర కూడా ఫ్లాప్ అయింది. ఇందులో ఆయన చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడిన వారు కూడా ఎవరూ లేరు. కొడుకు అక్కినేని నాగ చైతన్యతో కలిసి చేసిన బంగార్రాజు ఓ మోస్తారుగా ఆడింది. మరీ డిసప్పాయింట్ చేయకపోయినా భారీ కమర్షియల్ హిట్ అని మాత్రం చెప్పలేము.
ది ఘోస్ట్ తర్వాత నాగ్ ఏ సినిమా ఒప్పుకోవాలన్నా బాగా ఆలోచిస్తున్నారు. ఆయన తోటి హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ అలాగే యంగ్ హీరోలు వరుస సక్సెస్‌ల మీద ఉన్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్మ్ చరణ్, ఎన్.టి.ఆర్ పాన్ ఇండియన్ స్టార్స్‌గా మారిపోయారు. దాంతో నాగ్ కూడా ఆ రేంజ్ సక్సెస్ సాధించాలని ఆలోచనలో పడ్డారు.
Nagarjuna : మనం సీక్వెల్ గనక తీస్తే..
అయితే, స్ట్రైట్ కథలు కాకుండా మెగాస్టార్, పవన్ కళ్యాణ్‌ల మాదిరిగా పరభాషలో హిట్ సాధించిన కథ రైట్స్ తీసుకొని తెలుగులో రీమేక్ చేయాలని ట్రై చేస్తున్నారట. మరి నాగార్జునకి ఆ కథ సూటవుతుందో లేదో చూడాలి. తెలుగులో మాత్రం స్టార్ డైరెక్టర్స్ నాగ్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే కొందరు కథలను కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఈ కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో చూడాలి.
ఇక ఇప్పటికే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన అక్కినేని మనం సినిమా సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి గత కొంతకాలంగా దర్శకుడు విక్రమ్ కె కుమార్‌తో చర్చలు జరుపుతున్నారట. కానీ, ఇంకా కథ ఓ కొలిక్కి రాలేదని సమాచారం. ఇక నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయాన కొనసాగింపుగా వచ్చిన బంగార్రాజు ఆశించిన విజయాన్ని అందుకోలేదు. మరిని మనం సీక్వెల్ గనక తీస్తే ఆ సినిమా ఏమేరకు హిట్ సాధిస్తుందో చూడాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.