Seerat Kapoor: రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ సీరత్ కపూర్. ఈ అమ్మడు డాన్సర్ మాస్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే అనూహ్యంగా తెలుగులో రన్ రాజా రన్ సినిమాలో శర్వానంద్ కి జోడీగా నటించే ఛాన్స్ ని సొంతం చేసుకొని హీరోయిన్ అయిపొయింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తుంది.
తరువాత సందీప్ కిషన్ టైగర్ మూవీలో హీరోయిన్ గా నటించింది. సుమంత్ అశ్విన్ కి జోడీగా కొలబంస్ సినిమాలో నటించింది. రాజుగారి గది 2లో కూడా సీరత్ కపూర్ నటించింది. ఈ సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా ఆమె పాత్ర ఉంటుంది.అల్లు శిరీష్ కి జోడీగా ఒక్క క్షణం అనే మూవీలో కూడా ఈ అమ్మడు ఆదిపాడింది.
ఇలా తెలుగులో ఆమె చేసిన అన్ని సినిమాలలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలే లభించాయి. రవితేజకి జోడీగా టచ్ చేసి చూడు సినిమాలో కూడా సీరత్ కపూర్ నటించింది. ఇక చివరిగా సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలలో సీరత్ కపూర్ నటించింది.
ఆ సినిమా తర్వాత మరల తెలుగులో ఇప్పటి వరకు ఈ అమ్మడు కనిపించలేదు. రెండేళ్ళ పాటు సీరత్ కపూర్ ఎవరి దృష్టిలో పడలేదు అని చెప్పాలేదు. సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ గా లేదు. మరల చాలా గ్యాప్ తర్వాత తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ అయ్యింది. అయితే ఆమె అప్డేట్స్ ఇస్తూ ఉన్న తెలుగు ప్రేక్షకులు మాత్రం సీరత్ కపూర్ పై దృష్టి పెట్టలేదు.
ఇదిలా ఉంటే ఎప్పుడూ కూడా మోడరన్ గా కనిపించే సీరత్ కపూర్ మొదటి సరి ట్రెడిషనల్ లుక్ లో చీరకట్టులో దర్శనం ఇచ్చింది. ఈ చీరలో సీరత్ మరింత గ్రాండ్ గా కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా కర్లింగ్ హెయిర్ తో కనిపించే అమ్మడు ఇలా చీరకట్టుగా కనిపించేసరికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.