Sharath Babbu: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయనపై కాస్త కూడా సానుభూతి చూపించకుండా ఓ హీరోయిన్‌ను ఆయన సీక్రెట్‌గా పెళ్ళి చేసుకున్నారా..? అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అద్భుతమైన పాత్రలను పోషిస్తూ తెరపై కనిపిస్తున్నంత సేపు వారి వ్యక్తిగత విషయాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరు.
కానీ, ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడో, అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిపాలైనప్పుడో రక రకాల విషయాలు ప్రచారంలోకి వస్తాయి. అప్పుడే వాటిని నిజా నిజాలేంటో తెలుసుకోకుండా ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు కూడా శరత్ బాబు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆయనకి హీరోయిన్ నమితతో పెళ్లి జరిగిందని వార్త ఒకటి వైరల్ అవుతోంది.
అయితే ఈ వార్తలు అటు ఇటూ తిరిగి నమిత చెవిన పడ్డాయి. దాం నమిత స్పందించింది. ఇవన్నీ కేవలం పుట్టించిన పుకార్లేనని..మా ఇద్దరికీ పెళ్లి జరిగింది..సహజీవనం చేస్తున్నాము అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. నమితకి సినిమాల్లో అవకాశాలు తగ్గాక తమిళ్ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. పెళ్లి చేసుకొని ప్రస్తుతం డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. అవకాశం వస్తే మళ్ళీ సినిమాలలో నటించడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది.
కాగా, ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. త్వరలో ఆయన పూర్తిగా కోలుకొని ఇంటికి వస్తారని సన్నిహితులు నమ్మకంగా ఉన్నారు. గతకొంతకాలంగా సినిమాలలో తక్కువగా కనిపిస్తున్న శరత్ బాబు ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో చిన్న పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవికి మంచి స్నేహితుడు చాలా తక్కువమందికి తెలుసు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.