Sapthami Gowda : కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ రోజుకో వివాదంతో హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. ఈ మధ్యనే స్టార్ హీరో దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. ఇక లేటెస్టుగా ఇప్పుడు ఇండస్ట్రీలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. యంగ్ హీరో యువ రాజ్‌కుమార్ భార్య శ్రీదేవి బైరప్పపై ‘కాంతార’ ఫేమ్ నటి సప్తమి గౌడ రూ.10 కోట్ల పరువు నష్టం కేసు ఫైల్ చేసింది. ఈ కేసుతో మరోసారి కన్నడ ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మరింది.
‘యువ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు యువ రాజ్ కుమార్ . యువ రాజ్ కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ సోదరుడి కుమారుడు. ఈ మూవీలో యువ రాజ్ కు జోడీగా సప్తమి యాక్ట్ చేసింది. ఈ మూవీ మంచి రెస్పాన్స్ వచ్చింది. వసూళ్ల పరంగా కూడా ఫర్వాలేదనిపించింది. అయితే వ్యక్తిగతంగా మాత్రం ఈ సినిమాతో యువ రాజ్ కి గట్టి దెబ్బే తగిలింది. రీసెంట్ గా యువ రాజ్‌కుమార్ తన భార్య శ్రీదేవి నుంచి డివోర్స్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ డివోర్స్ న్యూస్ కన్నడ నాట సెన్సేషన్ అయ్యింది. అయితే డివోర్స్ నోటీసులు అందిన నాటి నుంచి శ్రీదేవి మీడియాలో సంచలన ఆరోపణలు చేస్తోంది. తమ విడాకులకు నటి సప్తమి గౌడ కారణమంటూ ఆమె ఆరోపిస్తోంది. తన భర్తకు సప్తమితో వివాహేతర సంబంధం ఉందని శ్రీదేవి తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సప్తమి గౌడ,తన భర్త ప్రేమలో ఉన్నారని తాను అమెరికా వెళ్లినప్పుడు వీరిద్దరూ లివింగ్ లో ఉన్నారని కూడా చెప్పుకొచ్చింది. సప్తమి కోసం తనను ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం కూడా నా భర్త చేశాడని చెప్పింది శ్రీదేవి.
అయితే తాజాగా ఈ ఆరోపణలపై నటి సప్తమి సీరియస్ అయింది. ఏమాత్రం ఆలోచించకుండా శ్రీదేవి భైరప్పపై బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసింది. తన పరువుకి నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా ఆమెపై యాక్షన్ తీసుకోవాలని కోరింది. దీంతో శ్రీదేవికి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. దానితో పాటే సప్తమి పరువునష్టం దావా కూడా వేసింది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరైనది కాదని, ఇలాంటి ఆరోపణల వల్ల తన పరువకి నష్టం వాటిల్లిందని రూ.10 కోట్లు చెల్లించాలని సప్తమి డిమాండ్ చేసింది. అంతే కాదు మీడియా ఎదురుకుగా వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలిపింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.