Sandals: సాధారణంగా కొంతమంది దేవాలయాలకు చెప్పులు వేసుకొని వెళ్తే మరికొందరు చెప్పులు లేకుండా వెళ్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్పులు పోవడం అన్నది కామన్ అయిపోయింది. వారి చెప్పులే అనుకోని పొరపాటున ఇతరుల చెప్పులు వేసుకొని వెళ్లడం, లేదంటే చెప్పులు దొంగలించడం లాంటివి చేస్తున్నారు. దీంతో చాలామంది గుడికి చెప్పులు వేసుకుని వెళ్లడమే మానేశారు. దాంతో చాలామంది చెప్పులు పోయాయని బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం గుడి దగ్గర చెప్పులు పోతే మంచిదని, మనకున్న శని మొత్తం పోతుంది అని నమ్ముతూ ఉంటారు. మరి నిజంగానే గుడి దగ్గర చెప్పులు పోవడం మంచిదేనా ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒకవేళ ఆలయాల వద్ద మీ చెప్పులు చోరీకి గురైతే బాధ పడటం మానేసి సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆలయాల వద్ద చెప్పులు పోవడం మన జీవితంలో జరిగే శుభాలకు సంకేతంగా భావించాలి. అంతేకాకుండా దేవాలయాల వద్ద చెప్పులు పోవడం అన్నది అదృష్టంగా భావించాలి. చెప్పులు పోతే మన జీవితంలో శని బాధలు తొలగిపోతాయని చెబుతారు. చెప్పులు చోరీకి గురైతే అప్పుల బాధ నుండి బయటపడతామని, పేదరికం నుండి విముక్తి దొరుకుతుందని అర్థం. మరీ ముఖ్యంగా శనివారం రోజు ఆలయం వద్ద చెప్పులు పోతే మరీ మంచిదట. శనివారం నాడు ఆలయం వద్ద చెప్పులు దొంగిలించబడితే మన జీవితంలో ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుందని అర్థం. చెప్పులను దానం చేయడం వల్ల, లేదా చెప్పులను ఎవరైనా తీసుకోవడం వల్ల శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయట.
మాములుగా శనిగ్రహం పాదాలలో నివసిస్తుందని చాలామంది చెబుతుంటారు. అటువంటి పాదాలకు ధరించే చెప్పుల పైన శని ప్రభావం ఉంటుందని చెప్తారు. రంగులు, తోలు రెండు శనిదేవుడికి సంబంధించినవి. కాబట్టి శని దేవుడి ప్రతికూల ప్రభావాల నుంచి బయట పడటం కోసం చాలామంది కావాలని ఆలయాల వద్ద శనివారం నాడు వారి బూట్లు, చెప్పులు వదిలివేస్తారు. దీనివల్ల తమ జీవితంలోని ప్రతికూల ఫలితాలు పోతాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల శని దేవుడు కలిగించే బాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. జాతకంలో శని వక్ర దృష్టి ఉంటే మనం ఎంత కష్టపడినా అనుకున్న పనులు జరగవు. అలాంటప్పుడు ఆలయాల వద్ద చెప్పులు ఎవరైనా చోరీ చేస్తే, లేదా మనమే చెప్పులు వదిలేస్తే కచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.