Samyuktha menon : పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది తమిళ కుట్టి సంయుక్త మీనన్. మొదటి సినిమా హిట్ కోట్టడంతో అమ్మడికి బాగానే కలిసి వచ్చింది. ఆ తరువాత వరుస పెట్టి అవకాశాలను దక్కించుకుంది సంయుక్త.
భీమ్లా నాయక్ తరువత ఈ అమ్మడు నటించిన బిబిసార, సార్ సినిమాలు హిట్ సాధించాయి. లేటెస్టుగా సంయుక్త నటించిన విరూపాక్ష సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో సంయుక్తను గోల్డెన్ లెగ్ గా అభివర్ణిస్తున్నారు. ఇదే టాపిక్ పై సంయుక్త తాజాగా స్పందించింది. తనను అలా పిలవడంపై హాట్ కామెంట్స్ చసింది. ఇలాంటి పాత కాలపు మాటలను , ఆలోచనలను పక్కనపెట్టాలని సూచించిందట.
మీడియాతో సంయుక్త మాట్లాడుతూ..” ఇలాంటి వర్ణణల అసలు మంచిది కాదు. హీరోయిన్ ను గోల్డెన్ లెగ్ అని ఐరెన్ లెగ్ అని పిలవడంలో అసలు అర్థమే లేదు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా హీరోయిన్ మీద ఆధారపడి ఉండదు. అది అందరి బాధ్యత. హిట్ కొట్టినప్పుడు గోల్డెన్ లెగ్ అని ఫ్లాప్ అయినప్పుడు ఐరెన్ లెగ్ అని హీరోయిన్ లను అభివర్ణిస్తూ మమ్మల్ని తక్కువ చస్తున్నారు. ఇది హీరోయిన్ లకు చాలా కష్టంగా ఉంటుంది. సరైన కథను, ఎంచుకుని అందులో మంచి పెర్ఫార్మెన్స్ అందరూ ఇస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది. సక్సెస్ వీటిపైనే ఆధారపడి ఉంటుంది. హీరోయిన్ పైన కాదు అని నేను అనుకుంటాను. ఈ పాత చింతకాయ పచ్చని పద్ధతులను కాస్త పక్కకు పెట్టండి. ” అంటూ సంయుక్త గోల్డెన్ లెగ్ కాన్సెప్ట్ పై తన స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించింది.
విరూపాక్ష సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. కార్తీక్ దండు డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ఇది. సుకుమార్ స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. శుక్రవారం థియేటర్లలో మూవీ విడుదలైంది. పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. ఈ మూవీలో సంయుక్త తన అందంతో పాటు అభినయంతో అందరిని ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.