Samyuktha Menon : సినిమా ఇండస్ట్రీతో ప్రేమలో పడియానంటూ మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్ తాజాగా చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీని పలకరించింది సంయుక్త. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర బాగా హైలెట్ కావడంతో ఇప్పుడు వరుసగా క్రేజీ ఆఫర్స్‌ను అందుకుంటున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీ కూడా సంయుక్తకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రూపొందుతున్న ద్విభాషా చిత్రం సార్‌లో హీరోయిన్‌గా నటించారు. త్వరలో ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో హీరోహీరోయిన్లు కలిసి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ సందర్భంగా సంయుక్త, తాను ఇండస్ట్రీకొచ్చినప్పటి సంగతులను ఎంతో ఆసక్తిగా చెప్పారు. కేరళలోని ఓ పల్లెటూళ్లో పుట్టారు సంయుక్త. అయితే, ఆమె సినిమాల్లోకి వచ్చి హీరోయిన్‌గా సక్సెస్ అవుతాని ఎంతమాత్రం ఊహించలేదట. మొదటి సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్నారట. కానీ, ఇక్కడ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ, ప్రేమ బావుందని..ఆ కారణంగానే ఇక్కడ నిలబడగలిగానని చెప్పుకొచ్చారు. ఒకే ఒక్క సినిమాతో చిత్ర పరిశ్రమకి గుడ్ బై చెప్పాలనుకున్న సంయుక్త మేనన్ ఆ తర్వాత నుంచి సినిమాలతో ప్రేమలో పడిపోయానంటూ వెల్లడించారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.