Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్నా కొన్ని బంధాలు మాత్రం మూనాళ్లకే విడిపోతున్నాయి. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్న దంపతుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. సినీ పరిశ్రమలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కొద్ది కాలంగా ఇండస్ట్రీలో డివోర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సమంత, చైతుల విడాకుల ప్రకటన అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. వీరిద్దరు విడిపోయి నాలుగేళ్లు అవుతున్నాయి ఇప్పటికీ సోషల్ మీడియాలో సందర్భం వచ్చిన ప్రతిసారి వీరిద్దరి గురించి నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటుంటారు.
చైతూ కి సంబంధించిన చాలా వరకు మెమొరీస్ ను ఇప్పటికే డిలీట్ చేసింది సామ్. ఇన్ స్టాలో వీరిద్దరూ కలిసున్న ఫోటోలను చై, సామ్ డిలీట్ చేశారు. కానీ తన పెళ్లినాటి డ్రెస్ ను మాత్రం భద్రంగా దాచుకుంది సమంత. సామ్ లేటెస్ట్ ఫోటోల ద్వారా ఈ విషయం తెలసింది. తన పెళ్లి డ్రెస్ కి కొత్త మెరుగులు అద్ది అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పెళ్లిలో సామ్ ధరించిన వైట్ గౌనును నల్లటి మోడ్రన్ అవుట్ ఫిట్ గా మార్చేసింది. దానిని ధరించి హాట్ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సామ్ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేస్తుంటే..నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
తాజాగా ముంబైలో జరిగిన ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల వేడుకలో పాల్గొంది సామ్. ఈ ఈవెంట్ కోసం ఈ చిన్నదినలుపు రంగు గౌను ధరించి స్టేజ్‌పై హొయలుపోయింది. ఈ బ్లాక్ అవుట్ ఫిట్ లో సామ్ ఎంతో హాట్ గా కనిపించింది. అంతేకాదు ఈవెంట్ ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది…అంతే కాదు ఓ మెసేజ్ ను కూడా పోస్ట్ చేసింది…”ఎల్లే లీడర్స్ ఆఫ్ ఛేంజ్‌గా నన్ను సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ ఈవెంట్ కోసం నా ఫేవరేట్ గౌనును రీమోడలింగ్ చేయించి మరీ ధరించాను. ఈ గౌనును అందంగా డిజైన్ చేసిన డిజైనర్ క్రేశాబజాజ్‌కు కృతజ్ఞతలు. నా హ్యాబిట్స్ ను మార్చుకోవడం, లైఫ్ స్టైల్ ని స్టాండర్ట్ గా చేసుకోవడంలో పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటి. నాపై మీరు చూపిస్తోన్న అభిమానానికి నా ధన్యవాదాలు”అని రాసుకొచ్చింది సమంత.
‘ఏమాయచేసావే’సినిమాతో చైతన్యకు దగ్గరైంది సమంత. ఈ సినిమాలో వీరి కెమెస్ట్రీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కూడా కావడంతో ఈ పెయిర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సమంత స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. సౌత్ ఇండస్ట్రీలో ఈమెకు ఎక్కడ లేనంత క్రేజ్ వచ్చింది. పొట్టిదే అయితే సామ్ అందం , అభినయం అందరిని ఆకట్టుకున్నాయి. కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్నప్పుడే సామ్ అక్కినేని నాగచైతన్యను ప్రేమించింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో 2017లో పెళ్లి చేసుకుంది. అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవా వేదికగా హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ హిందూ సంప్రదాయంగా జరిగిన పెళ్లి కోసం రామానాయుడి భార్య చీరను సమంత రీమోడల్ చేయించి కట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక క్రిస్టియన్ వెడ్డింగ్‌లో వైట్ గౌనును స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇక పర్సనల్ ఇష్యూస్ కారణంగా ఈ జంట 2021లో డివోర్స్ తీసుకుంది. అప్పటి వెడ్డింగ్ గౌనును భద్రంగా దాచుకున్న సామ్ తన మనసుకు నచ్చినట్లు రీమోడల్ చేయించి నలుపు రంగులోకి మార్చింది.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.