Shruti Haasan : కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతిహాసన్. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా తనకున్న మల్టీటాలెంట్ తో కొద్ది రోజుల్లోనే స్టార్డమ్ సంపాదించింది. గాయనిగా ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది శ్రుతిహాసన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. ప్రేక్షకులను అలరించింది. కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నా శ్రుతికి రియల్ లైఫ్ లో మాత్రం సినిమా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ బ్యూటీకి ప్రేమ పెద్దగా అచ్చిరావడంలేదని అర్థమవుతోంది. తాజాగా ఈ భామ తన రెండో ప్రియుడికి బ్రేకప్ ఇచ్చినట్లు రూమరస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే శ్రుతి ప్రియుడి ఫోటోలను డిలీట్ చేయడంతో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.
శ్రుతి హాసన్ మొదట లండన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. వీరిద్దరి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హమ్మయ్యా శ్రుతి త్వరలో ఓ ఇంటిదవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కొన్నిరోజులకే అతడికి బ్రేకప్ చెప్పేసింది. అయితే బ్రేకప్ కు గల కారణాలను మాత్రం చెప్పలేదు. ఫస్ట్ బ్రేకప్ తర్వాత చాలాకాలం సింగిల్ గానే ఉంది. సినిమాల కూడా పెద్దగా చేయలేదు. ఆ తర్వాత క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ దూసుకెళ్తోంది.
మొదటి బ్రేకప్ తర్వాత శ్రుతి శంతను హజారికతో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరి నాలుగైదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీలు కుదిరినప్పుడల్లా వీరిద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో ఫన్నీ రీల్స్ డ్యాన్స్ రీల్స్ చేసేశారు. ఆ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ కూడా చేశాయి. ఇక ఈవెంట్స్ లో జోడీగా పాల్గొంటూ సోషల్ మీడియాలో ఈ కపుల్ ట్రెండ్ అయ్యేవారు. అయితే గత కొన్నిరోజులుగా వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కానీ వీడియోలు కానీ నెట్టింట్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఇద్దరు విడిపోయారా ? అన్న రూమర్స్ ఆ మధ్య తెగ వినిపించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇద్దరూ ఇన్ స్టాలో ఒకరినొkకరు అన్ ఫాలో చేయడంతో ఈ రూమర్స్ కు బలం చేకూరినట్లైంది. అంతే కాదు శంతనుతో దిగిన ఫోటోలను శ్రుతి తాజాగా డిలీట్ కూడా చేసింది. దీంతో శ్రుతి శంతనుకు బ్రేకప్ చెప్పిందన్న క్లారిటీ వచ్చింది. కానీ ఈ విషయంపై వీరిద్దరూ ఇంకా రెస్పాండ్ కాలేదు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.