Samantha: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా ఆమె కెరియర్ ముగిసింది అని చెప్పాలి. ఇప్పుడు ఫిమేల్ సెంట్రిక్ కథలతో తనని తాను సోలోగా ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉంది. అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
ఇందులో భాగంగానే గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకుంది. కెరియర్ లో సోలోగా ఏకంగా 50 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. దీని తర్వాత విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషి మూవీ కూడా అన్ని భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సమంతా మయోసైటిస్ నుంచి రికవరీ కావడంతో ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్ట్ ల మీద దృష్టి పెట్టింది. అలాగే తన దృష్టి మొత్తం ఇప్పుడు బాలీవుడ్ పై ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగులో ఫిమేల్ సెంట్రిక్ కథలు మాత్రమే చేస్తూ బాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ కావాలని అనుకుంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ తో తనని బాలీవుడ్ కి పరిచయం చేసిన రాజ్ అండ్ డీకే కాంబినేషన్ లో సిటాడెల్ రీమేక్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఇందులో తెరకెక్కుతుంది.
ఇందులో వరుణ్ ధావన్ కూడా హీరోగా నటిస్తూ ఉండగా సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన ఫేమ్ మారుతుందని సమంతా భావిస్తుంది. ఈ నేపధ్యంలో ఆమె ముంబైకి షిఫ్ట్ అయ్యేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఆమె ముంబైలో 15 కోట్లు పెట్టి ఓ హౌస్ కూడా కొన్నదని టాక్. త్వరలో దీనికి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. హైదరాబాద్ లో ఉంటే గత జ్ఞాపకాలు గుర్తుకోస్తాయని ఆమె ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.