Samantha: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంతా నటించిన శాకుంతలం మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నెలలోనే రిలీజ్ కావాల్సిన చిత్రాన్ని ఏప్రిల్ కి వాయిదా వేశారు. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్ ని మరింత పెంచుతుంది అని సమంత భావిస్తుంది. మరో వైపు తెలుగులో చేస్తున్న ఖుషి మూవీని కంప్లీట్ చేయడానికి రెడీ అవుతుంది. మార్చి మొదటి వారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. లేడీ ఓరియంటెడ్ కథలపైనే ప్రస్తుతం సమంత ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.
అందులో భాగంగా తనని తాను యాక్షన్ క్వీన్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని భావిస్తుంది. ది ఫ్యామిలీ మెన్ 2 తర్వాత సమంతా రాజ్ అండ్ డీకే కాంబినేషన్ లో సిటాడెల్ రీమేక్ చేస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే మయోసైటిస్ బారిన పడి ఇప్పుడే రికవరీ అయిన సమంత మరల బాడీని తిరిగి ఫుల్ కండిషన్ లోకి తీసుకురవాదానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకొని ప్రతి రోజు కండలు పెంచే ప్రయత్నం చేస్తుంది. సిటాడెల్ మూవీలో ఆమె మంది ఫిట్ లుక్ లో సిక్స్ ప్యాక్ పర్సనాలిటీతో యాక్షన్ క్వీన్ ఫీచర్ లోకి రావడానికి గట్టిగా కష్టపడుతుంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ధ్యాస అంతా కూడా దాని మీదనే ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. సిటాడెల్ తర్వాత ఓ హాలీవుడ్ మూవీ కూడా సమంత చేయబోతుంది. దానిని జూన్ లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉండనే మాట ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.