Samantha : ప్రొఫెషనల్ గానే కాదు, వ్యక్తిగతంగానూ సౌత్ బ్యూటీ సమంత ఒక సెన్సేషనే. కెరీర్ మొదట్లో తమిళంలో కొన్ని సినిమాలు చేసినా తెలుగులో మాత్రం ఆమె లైఫ్ టర్న్ చేసింది మాత్రం ఏమాయ చేసావే మూవీ. ఈ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిగ్ గా మారిపోయింది. టాలీవుడ్ స్టార్ నటులతో నటించే అవకాశాలను కొట్టేసింది . తెలుగులో స్టార్డమ్ వచ్చాక మళ్లీ తమిళంలో క్రేజీ ప్రాజెక్టుల్లో నటించింది. విజయ్, సూర్య, విశాల్ వంటి తమిళ స్టార్ హీరోల సరసన నటించి అదరగొట్టింది. అలా తెలుగు, తమిళంలో క్రేజీ హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది.
కెరీర్ లైఫ్ లో సక్సెస్ అయిన సమంత వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. పెళ్లైనా కొన్నాళ్లకే సమంత నాగచైతన్య నుంచి డివోర్స్ తీసుకుంది. అభిప్రాయభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఈ విషయం పక్కన పెడితే సమంత అప్పట్లో అల్లు అర్జున్ హిట్ మూవీ పుష్పలో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సినిమాలో ఈ పాట ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ఊ అంటావా మామ అంటూ సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరీ మాస్ స్టెప్స్ తో అలరించింది. ఈ సాంగ్ కోసం సమంత మేకర్స్ నుంచి ఏకంగా రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుందట. అయితే ఈ పాట చేయొద్దని ఆమె పేరెంట్స్, ఫ్రెండ్స్ చెప్పారని ఈ మధ్యనే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సమంత. అయితే వారి మాట వినకుండా నేను ఆ పాటకు ఓకే చెప్పానని తెలిపింది. అప్పుడు ఆ పాటే నా లైఫ్ లో టర్నింగ్ గా మారిందని చెప్పింది. నిజం చెప్పాలంటే ఆ ఛాన్స్ ఎందుకు వద్దు అనేదానికి తన దగ్గర సరైన కారణం లేదంది. అలాంటప్పుడు ఎందుకు చేయకూడదని , నేనేం తప్పు చేయలేదు కదా అని నాలో నేను అనుకున్న.
నా వివాహా జీవితంలో నేను నూటికి నూరు శాతం నిజాయితీగా ఉన్నా. అయితే అది వర్కౌట్ కాలేదు అని సమంత చెప్పిన ఈ విషయం పాతదే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మైయోసైటీస్ బారినపడిన సమంత తెలుగులో ఖుషీ సినిమా తర్వాత మరో చిత్రం చేయలేదు. సామ్ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. సీటాడెల్ ప్రాజెక్ట్ కోసం కష్టపడుతోంది. అంతే కాదు తన సొంత నిర్మాణంపైన దృష్టి పెట్టింది. సినిమాలు పెద్దగా లేకపోయినా సామ్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.