Samantha : స్టార్ హీరోయిన్ సమంత అందరికీ సుపరిచితమే. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది ఈ చిన్నది. త్వరలోనే వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది సామ్. ఈ మధ్యలో దొరికిన గ్యాప్ లో సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు పెడుతూ అభిమానులను అలరిస్తోంది. ఇప్పటికే సామ్ తన ప్రొఫెషనల్ అకౌంట్లో ఎమోషనల్, ప్రొఫెషనల్ పోస్టులు చాలానే చేసింది. అంతే కాదు తన లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ పిక్స్ కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది. తాజాగా సామ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. అది కాస్త ఓ రేంజ్ లో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్. క్రికెట్ లవర్స్ అంతా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అవకాశం ఉన్నవారు స్టేడియంలకు వెళితే లేనివారు ఇంట్లో టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇవాళ ఆర్‌సీబీ, ఆర్ఆర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గురించి సామ్ చేసిన పోస్టే ఇప్పుడు నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. ఇంతకి సామ్ ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ చేసింది.? ఇంతకు ఆ పోస్టులో ఏముంది?.
ఆర్‌సీబీ ఈసారి కప్పు గెలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ ఏడాదైనా ఆర్‌సీబీ ఐపీఎల్ విన్ అవ్వాలని దేవుడిని మొక్కుకుంటున్నారు. ఎట్టకేలకు ఆ గడియ రానే వచ్చింది. ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ రాజస్థాన్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఆర్సీబీ గెలవాలని చాలా మంది ఆకాంక్షిస్తున్నారు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సారథ్యంలోని ఆర్‌సిబి టీమ్ విజయం సాధించాలని సౌత్ బ్యూటీ సమంత కూడా ప్రార్థించినట్లు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అందుకు కారణం సామ్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన పోస్ట్. నువ్వు గెలవాలని కోరుకుంటున్నా అంటూ ఈ బ్యూటీ ఓ పోస్ట్ షేర్ చేసింది. అంతే కాదు ఈ పోస్ట్ కు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘నీ మనసు ఏది కోరుకున్నా, నీ కోరిక ఏదైనా, నేను మీ కోసం నిలబడతాను. గెలపు నిన్ను వరిస్తుంది ” అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో సామ్ ఆర్‌సీబీ టీమ్‌కి సపోర్ట్ గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సామ్ అంతకు ముందు చాలా సార్లు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రశంసలతో పొగిడేసింది. అప్పట్లో ఈ బ్యూటీ కోహ్లీ పై చూపించిన అభిమానం, ప్రశంసల కారణంగానే ఇప్పుడు సామ్ చేసిన పోస్ట్ ఆర్సీబీ విజయం కోసమే అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక రన్స్ చేసిన సీడీసీ ఆరెంజ్ క్యాప్‌ను విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. మరి ఇవాళ్టి మ్యాచ్ లో ఏం జరుగుతుందని అందరిలో ఆసక్తి నెలకొంది. అది తెలియాలంటే కాస్త ఎదురుచూడాల్సిందే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.