Categories: EntertainmentLatest

Karate Kalyani : అమ్మ హేమ..నీ డ్రామాలు ఆపు

Karate Kalyani : బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది. సీనియర్ నటి హేమ ఈ పార్టీకి వచ్చినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్‌ దయానంద్‌ క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు రేవ్‌ పార్టీతో తనకేమీ సంబంధం లేదని నిరూపించేందుకు హేమ తప్పుడు ప్రచారానికి దిగారని దయానంద్‌ తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో హేమపై నెట్టింట్లో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇదే క్రమంలో హేమపై నటి కరాటే కళ్యాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రేవ్ పార్టీకి వెళ్లిన వారిని కర్రపట్టుకుని రేవు పెట్టేయాలని మాట్లాడింది. అంతే కాదు హేమని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కూడా బాంబ్ పేల్చింది.

karate-kalyani-shocking-comments-on-actress-hema-over-bangalore-rave-party

మీడియాతో నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ..”నేను ‘మా’ జాయింట్ సెక్రటరీగా మాట్లాడుతున్నా. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అది ఆడవాళ్లు అయినా మగ వాళ్లు అయినా.. తప్పు తప్పే. ఈ రేవ్ పార్టీలకు వెళ్లేవారిని రేవు పెట్టాలి. విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతూ పిచ్చి పిచ్చి వేషాలులు వేస్తున్నారు. రూ.60 లక్షలు పెట్టి రేవ్ పార్టీలు నిర్వహించడం ఏంటండీ. అంతలా ఎంజాయ్ చేయాలంటే..కుటుంబంతో వెళ్లొచ్చు కదా. తాగడం, తూగడం ఇవేం పార్టీలు. మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. ఏది జరిగినా ఇండస్ట్రీని అంటున్నారు. ఇలాంటి వాళ్లు వల్ల మొత్తం తప్పు ఇండస్ట్రీ చేసిందని అంటున్నారు. నాకు డ్రింక్స్ అలవాటు లేదు. ఇండస్ట్రీలో నాలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. మేము నటులుగా తాగుబోతు క్యారెక్టర్లు చేస్తాం కానీ తాగం. కానీ మేము తాగుబోతులం అని మాపై ముద్ర వేసేస్తుంటారు. ఇండస్ట్రీ వాళ్లంతే అని ఈజీగా అనేస్తుంటారు. ఇప్పుడు హేమ దొరికింది. ఆమెతో పాటు చిన్న చిన్న ఆర్టిస్ట్‌లు ఉన్నారు.

karate-kalyani-shocking-comments-on-actress-hema-over-bangalore-rave-party

ముందు హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్, హేమలు రేవ్ పార్టీలో ఉన్నట్టు న్యూస్ విన్నాం. కానీ.. శ్రీకాంత్ గారు, జానీ మాస్టర్ అతందా ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఉంది హేమ మాత్రమే. మిగిలిన ఇద్దరు లేరు. హేమ తనంతట తానే బుక్కైపోయింది. ఆమెకు వాగుడు ఎక్కువ. తన వెకిలిచేష్టలతో ఇలా అడ్డంగా బుక్కైంది. ఆమెను చూస్తుంటే పాపం జాలేస్తుంది. పరీక్షల్లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా రాకూడదని నేను కోరుకుంటున్నా. ఆమెకి మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ విషయంలో ఇండస్ట్రీ పరంగా ఆమెకు శిక్ష ఉంటుంది. ఎవ్వరైనా రూల్ ప్రకారం శిక్షార్హులే. హేమని ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేస్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌లో ఆమె మెంబర్ కాబట్టి.. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది” అంటూ కళ్యాణి ఓ రేంజ్‌లో హేమకు ఇచ్చిపడేసింది.

Sri Aruna Sri

Recent Posts

Tirumala: శ్రీవారి భక్తులు అలర్ట్…SSD టోకెన్ రద్దు చేసిన టీటీడీ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…

15 hours ago

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

2 days ago

Temple Donation: ఆలయానికి డబ్బు దానం ఇస్తున్నారా? ఇవి దానం చేస్తే రెట్టింపు పుణ్యం?

Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…

2 days ago

Health care: రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేస్తున్నారా.. ఈ ఇబ్బందులు మీ వెంటే?

Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…

3 days ago

Tirumala: తిరుమల భక్తులు అలర్ట్.. గదుల  కేటాయింపులో కీలక మార్పులు చేసిన టీటీడీ..

Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…

3 days ago

Covid 19: కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…

3 days ago

This website uses cookies.