Salt Box: సాధారణంగా ప్రతి ఒక్కరు బాగా డబ్బు సంపాదించి అష్టైశ్వర్యాలతో సుఖసంపదలతో ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ విధంగా డబ్బు సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇలా డబ్బు సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్న కొంతమంది దగ్గర మాత్రం చేతిలో రూపాయి కూడా ఉండదు.ఇలా సంపాదించినది మొత్తం వృధాగా ఖర్చు అవుతూ ఉండడం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఈ విధమైనటువంటి సమస్యల నుంచి విముక్తి పొందాలి అంటే ఈ చిన్న పరిహారాలు పాటించడం వల్ల డబ్బు సమస్య నుంచి బయట పడవచ్చు.
శుక్రవారం రోజు లక్ష్మి దేవికి ప్రీతికరమైన రోజు. అందువల్ల ఆరోజున ఒక మట్టి జాడిని తీసుకొని లక్ష్మీదేవికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తరువాత ఒక రాగి లేదా ఇతడి ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో కొత్త పసుపు వస్త్రాన్ని ఉంచాలి. ఆ తరువాత ఈ వస్త్రానపై 9 వక్కలను, ఒక పసుపు కొమ్మును ,వెండి లేదా బంగారంతో చేసిన ఉంగరాన్ని లేదా నాణాన్ని ఉంచి మూట కట్టాలి. తరువాత ఈ మూటను మట్టి జాడీలో అడుగు బాగానే ఉంచి దానిపైన రాళ్ల ఉప్పును పోయాలి. ఈ విధంగా మట్టి జాడీలో పోసిన రాళ్ల ఉప్పును వంటల్లో కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారు.
ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పుని ఎవరికి దానం చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పుని ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుంది. అలాగే ఉప్పును ఎక్కడపడితే అక్కడ పారేయటం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఉప్పుని విసిరేయటం వల్ల ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. అందువల్ల పొరపాటున కూడా ఉప్పుని ఎవరికైనా దానం చేయటం లేదా పారేయటం వంటి పనులు చేయకూడదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.