Salaar : ఓటీటీలో సలార్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Salaar : వరుస ఫ్లాపులు.. భారీ బడ్జెట్‌ చిత్రాలు సైతం బాక్సాఫీస్‌ దగ్గర డిజాస్టర్‎గా నిలిచాయి. సలార్ అయినా సాలిడ్ హిట్ ఇస్తుందా? అని చాలామంది ప్రభాస్‎ను అనుమానించారు. కానీ కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌ అంటూ సలార్‌తో దుమ్ముదులుపుతున్నాడు డార్లింగ్. బాక్సాఫీస్ దగ్గర సలార్ సెన్సేషనల్ రికార్డ్స్ సృష్టించడం ఖాయంగా తెలుస్తోంది. విడుదలైన రోజే బ్లాక్ బస్టర్ హిట్ తో సలార్ దూసుకుపోతోంది. ప్రభాస్‌ లుక్‌ చూసి భారీ వసూళ్లను రాబడుతుందని ఫ్యాన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. స్టార్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ క్రియేటివిటీ..ప్రభాస్‌ మాస్‌ లుక్‌, పృథ్వారాజ్ అమేజింగ్ నటన సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. సలార్ ముందు కేజీఎఫ్ కూడా పనికిరాదని ప్రభాస్ ఫ్యాన్స్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

salaar-netflix-owns-ott-rights

ప్రపంచవ్యాప్తంగా ఇవాళ సలార్‌ థియేటర్లలో సందడి చేస్తోంది. ఫస్ట్‌ షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. ట్విట్టర్ రివ్యూలు కూడా సినిమా సూపర్ అంటూ వచ్చేశాయి. విమర్శకులు సైతం సినిమా అద్భుతహా అంటూ రివ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభాస్‌ అభిమానుల రికార్డుల వేట షురూ అయ్యింది. కాలర్‌ ఎగరేసి మరీ భారీ వసూళ్లు ఖాయం అని చెప్తున్నారు. ఇదిలా ఉంటే సలార్‌ ఓటీటీ రిలీజ్ ఎప్పుడుంటూ మరికొంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హిట్ టాక్ తో ముందుకెళ్తుండటంతో ఈ సినిమా రైట్స్‌ ఎవరు దక్కించుకున్నారన్న విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సలార్ రైట్స్ ను దక్కించుకుంది. దాదాపు రూ.160 కోట్లు పెట్టి మరీ సలార్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్ ను దక్కించుకుంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

salaar-netflix-owns-ott-rights

థియేటర్‎లో ఏ మూవీ రిలీజ్ అయినా 30 రోజులు తర్వాత ఓటీటీలో ప్రత్యక్షమవుతుంటుంది. సినిమాకు వచ్చే రేటింగ్ ని బట్టి ఒక్కోసారి కాస్త ఆలస్యం కూడా కావచ్చు. మరికొన్ని సినిమాలు త్వరగానూ స్ట్రీమ్ కావచ్చు. ఈ లెక్కన సలార్‌ సినిమా నెల రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే హిట్ సినిమాలైతే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ కూడా రైట్స్ కోసం పోటీ పడుతుంటాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేస్తుంటాయి. సలార్ కు ఓ రేంట్ హిట్ టాక్ రావడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ రైట్స్ దక్కించేందుకు పోటీ పడ్డాయి. ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ ఆ ఛాన్స్ కొట్టేసింది. అయితే సినిమా ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ అనౌన్స్ మెంట్ కూడా త్వరగా చేస్తుందని సమాచారం. ఏది ఏమైనా ఈ సారి ప్రభాస్ తన రేంట్ ఏంటో చూపించాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన డార్లింగ్ ఫ్యాన్స్ హిట్ ఖాతాలో పడటంతో కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న కల్కీ మూవీలో అందరి దృష్టి పడింది. ఈ సినిమాను మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. సరాల్ సాలిడ్ హిట్ తో ఈ మూవీపైనా అంచనాలు పెరిగిపోయాయి.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

8 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

10 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.