Salaar : సలార్ మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. మొదటి షో నుంచే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత మొదలుపెట్టింది. విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యాక్షన్ క్రియేషన్ కి అంతా ఫిదా అవుతున్నారు. ఒకే ఒక్క హిట్ కోసం ఐదేళ్ల నుంచి ఆకలితో ఉన్న ప్రభాస్ ఫాన్స్ ఎట్టకేలకు సలార్ తీర్చింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కటౌట్ ని బాగా వాడిన సినిమా సలార్. పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రభాస్ ను చూసుకుని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. డార్లింగ్ కట్ అవుట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ అద్భుతహా అని అంటున్నారు సినీ ప్రేమికులు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజే వరల్డ్ వైడ్‌గా రూ.178.7 కోట్ల వసూళ్లను అందుకుంది. రెండో రోజూ సలార్ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సంవత్సరం భారత మార్కెట్ టాప్ గ్రాసర్స్ గా మొదటి మూడు స్థానాల్లో జవాన్, పఠాన్, యానిమల్ సినిమాలు నిలిచాయి. ప్రస్తుతం సలార్ దూకుడు చూస్తుంటే ఈ మూడు సినిమాల కంటే అధికంగా వసూళ్లను రాబట్టి రికార్డ్ సెట్ చేసేలా ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన షారుఖ్ జవాన్ సినిమా 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా, పఠాన్ 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది, ఈ మధ్యనే విడుదలైన డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ క్రియేషన్ యానిమల్ మూవీ 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఇప్పుడు సలార్ తో ప్రభాస్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సలార్‌కు సంబంధిం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. సలార్ సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది. ప్రభాస్ యాక్టింగ్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రశాంత్ నీల్ క్రియేటివిటీకి సెల్యూట్ చేస్తున్నారు. కేజీఎఫ్ తో జనాలను కట్టిపడేసిన ప్రశాంత సలార్ తో అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. ఈ సినిమాలోని ప్రతి ఎలిమెంట్ అందరిని ఆకట్టుకుంటోంది. సలార్ ను ఎడిట్ చేసిన టెక్నీషియన్స్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మూవీలోని ప్రతి సీన్ ను అద్భుతమైన ఎడిటింగ్ అందించారు టెక్నీషియన్స్. సలార్ హిట్ అవ్వడానికి వారూ కారణమే. ఈ క్రమంలో ఆదిలాబాద్ కుర్రాడి పేరు ఇప్పుడు హైలెట్ అవుతోంది. సలార్ కు అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
సినిమాలపై ఉన్న ఆసక్తే సినీ రంగంలోకి అడుగుపెట్టెలా చేసింది. పర్సనల్ గా ఓ కంప్యూటర్ కొనుగోలు చేసి యూట్యూబ్ సహాయంతో టెక్నిక్స్ నేర్చుకుని అసిస్టెంట్ ఎడిటర్‌గా రాణిస్తున్నాడు తెలంగాణకు చెందిన కుర్రాడు రామగిరి విష్ణు. అసిస్టెంట్ ఎడిటర్ అని తీసిపాడేయకండి అతడి టాలెంట్ కు డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫిదా అయ్యాడు అందుకే ఏకంగా ప్రభాస్ సలార్ మూవీకి అసిస్టెంట్ ఎడిటర్‌గా తీసుకున్ానడు. తన కెరీర్ లోనే పెద్ద ఘనతను సాధించాడు. రామగిరి విష్ణు సొంతూరు ఆదిలాబాద్ జిల్లాలోని కడెం. పేరెంట్స్ శ్రీనివాస్-లత. విష్ణు తండ్రి దర్జీ పని చేస్తుంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. స్టూడెంట్ గా ఉంటూనే విష్ణు తనకెంతో ఇష్టమైన మూవీ ఫీల్డ్ లో రాణించాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. ఆ మక్కువతో ఎలాగైనా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని సామాజిక మాధ్యమాల ద్వార ఎడిటింగ్ లో టెక్నిక్స్ తెలుసుకున్నాడు. తాను నేర్చుకున్న నైపుణ్యంతో వీడియోలను ఎడిట్ చేసి డైరెక్టర్లకు పంపించేవాడు. ఈ క్రమంలో సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ విష్ణుకు ఛాన్స్ ఇవ్వడంతో సలార్ లో వర్క్ చేసే అవకాశం తక్కించుకున్ానడు. ఫస్ట్ మూవీనే అగ్రహీరోతో, అగ్ర డైరెక్టర్ సినిమాకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేసి రాణించడంతో ఈ కుర్రాడి క్రియేటివిటీకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. గతంలో కల్యాణ్ డైరెక్షన్ లో రిలీజైన మ్యాడ్ మూవీకి విష్ణు వర్క్ చేశాడు. ప్రస్తుతం గ్యాంగ్ ఆఫ్ గోదావరి, లక్కీ భాస్కర్ మూవీస్ కి కూడా అసిస్టెంట్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినా విష్ణు సొంతంగా ఎడిటింగ్ నేర్చుకుని సినీ ఫీల్డ్ లోకి వెళ్లడంతో అతడి ఫ్రెండ్స్ , కడెం వాసులు అభినందిస్తున్నారు.
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
This website uses cookies.