Salaar 2 : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ మూవీ వరల్డ్ వైడ్ థియేటర్స్ ను ఓ ఊపు ఉపేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రభాస్ ను మళ్లీ ఫామ్ లో నిలబెట్టింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగానే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. సరికొత్త రికార్డులను సృష్టించింది . దేవాగా ప్రభాస్, వరద రాజమన్నార్‌గా కోలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తమ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రశాంత్ నీల్ సలార్ 1ను అద్భుతంగా తీయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సలార్ సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. లేటెస్టుగా సెకెండ్ పార్ట్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. అది తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
లేటెస్టుగా చేసిన ఓ ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ 2పై ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశాడు. ” సలార్ పార్ట్2 స్టోరీ రెడీ అయ్యింది. మరికొన్ని రోజుల్లో షూటింగ్ స్టార్ట్ వుతుంది. ఈ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. త్వరగా షూటింగ్ పూర్తి చేసి ‘సలార్2’ని 2025లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే డేట్ ఎప్పుడన్నది మాత్రం డైరెకర్, నిర్మాతలపై ఆధారపడి ఉంది. ఈ మూవీ సీక్వెన్స్‌లను కంప్లీట్ చేయడానికి నేను ఎల్2: ఎంపురాన్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలి”అని పృథ్వీ తెలిపాడు.
సలార్ 2ను ‘శౌర్యాంగ పర్వం’అనే పేరుతో తీస్తున్నారు. ఎన్నో ప్రశ్నలతో ఫస్ట్ పార్ట్ ను కంప్లీట్ చేశాడు ప్రశాంత్ నీల్. మరి ఈ రెండో పార్ట్‌లో వాటికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కచ్చితంగా సెకెండ్ పార్ట్ కూడా భారీ హిట్ కొడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడైతే ‘కల్కి 2898 ఏడీ’షూటింగ్ లో ఉన్నాడు. చిత్రీకరణ కూడా ఫైనల్ కు వచ్చింది. భారీ అంచనాలతో ఈ మూవీ మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇది పూర్తికాగానే ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ‘రాజా సాబ్’లోనూ నటిస్తున్నాడు. ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీ అని సమాచారం. ఇకపోతే హను రాఘవపూడితోనూ ఓ సినిమా లైనప్‌లో ఉంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.