Sai Pallavi : సహజ సిద్ధమైన నటనతో మెస్మరైజింగ్ డ్యాన్స్ మూవ్స్‌తో మలయాళీ బొమ్మైనా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌ను సొంతం చేసుకుంది క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి. మలయాళం మూవీ ప్రేమమ్‌తో ఫేమస్ అయిన సాయి పల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన నటనా నైపుణ్యంతో అతి కొద్దికాలంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.
దాదాపు ఇండస్ట్రీలో స్టార్ యువ నాయకులతో జోడీ కట్టి హీరోకు సమానంగా డ్యాన్స్‌మూవ్స్‌తో నటనతో ఇరగదీసే నటిగా లేడీ పవర్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా సాయి పల్లవి ఇకపై నటనకు బై చెప్పేస్తుందన్న గాసిప్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ గాసిప్స్ అన్నింటిపైనా క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తన లేటెస్ట్ ఇంటర్వ్యూని బట్టి తెలుస్తోంది.
కెరీర్ ప్రారంభం నుంచి ఆచితూచి అడుగులు వేస్తే వైవిధ్యమైన కథలను, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తూ వస్తోంది సాయి పల్లవి. అందులోనూ గ్లామర్‌కు తావివ్వకుండా నటనకు ఆస్కారం ఉన్న సినిమాలనే ఎన్నుకుంటోంది. అలా చేసిన అన్ని సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించాయి. ఈ మధ్యకాలంలో విడుదలైన విరాటపర్వం, గార్గి సినిమాలు మినహా అన్ని సినిమాలు హిట్ కొట్టాయి. వరుసగా లేటెస్ట్‌గా నటించిన సినిమాలు విజయం సాధించకపోవడంతో అప్పటి నుంచి సాయిపల్లవి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.
దీంతో గాసిప్ రాయుళ్లు రెచ్చిపోయి సాయి పల్లవి సినిమాలు బైబై చెప్పేసిందంటూ గాసిప్ప్ మొదలు పెట్టేశారు. ఇకపై సినిమాలు చేయబోదని పెళ్లి చేసుకుంటోంది సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అనేక వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో నిజంగా సాయి పల్లవి సినిమాలకు గుడ్‌బై చెప్పిందేమోనన్న అనుమానం, ఆందోళన కూడా అభిమానుల్లో మొదలైంది. అయితే సాయి పల్లవి ఈ విషయాలపై ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో నిజమేనేమో అని అంతా భావిస్తున్నారు.
తాజాగా చానాళ్ల తరువాత సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూ ద్వారా అభిమానులను పలకరించబోతోంది. సోనీ. సోనీ లైవ్ కోసం ఓ ప్రత్యేక ఇంటర్వ్యూనను ఇచ్చింది ఈ నేచురల్ బ్యూటీ. సింగర్ స్మిత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నిజం విత్ స్మిత అనే షోలో ప్రత్యక్షమయ్యింది సాయి పల్లవి. ఫిబ్రవరి 10న ఈ ఇంటర్వ్యూ స్ట్రీమింగ్ కానుంది. స్మిత, సాయి పల్లవి కెరీర్‌కు సంబంధించిన అనేక ప్రశ్నలకు ఈ షో ద్వారా అడిగినట్లు తెలుస్తోంది.
కేవలం సాయి పల్లవే కాదు, నాచురల్ స్టార్ నాని, రాణా కూడా ఈ షోలో పాల్గొని రచ్చ రచ్చ చేయనున్నారు. ఈ షోకు సంబంధించిన టీజర్‌ను సోనీ లైవ్ విడుదల చేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అవుతోంది. స్మిత అడిగిన కొన్ని ప్రశ్నలకు సాయి పల్లవి ఈ టీజర్‌లో గాపిస్ రాయుళ్లకు గట్టిగానే సమాధానం చెప్పింది. ఫిజికల్ అబ్యూస్, వెర్బల్ అబ్యూస్ అంటూ సీరియస్‌గా కౌంటర్ ఇవ్వడం బట్టి చూస్తుంటే సాయి పల్లవి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవ్వరికి ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేస్తుందని తెలుస్తోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.